Yuvraj Singh's Unique Gesture For Indian Cricket Team Captain Harmanpreet Kaur - Sakshi
Sakshi News home page

'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్‌ 

Feb 22 2023 7:25 AM | Updated on Feb 22 2023 8:54 AM

Yuvraj Singh Unique Gesture India-Cricket Team-Captain Harmanpreet Kaur - Sakshi

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌ అనగానే మొదటగా వచ్చే పేరు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ.. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా. పురుషులు క్రికెట్‌ ఆధిపత్యంలో మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ సంగతి మరిచిపోతున్నాం. టీమిండియా వుమెన్స్‌ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం మహిళల టి20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్న టీమిండియా వుమెన్స్‌ సెమీఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 23న జరగనున్న తొలి సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది భారత మహిళల జట్టు. ఇక హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. 150 టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా హర్మన్‌ చరిత్ర సృష్టించింది. అయితే టీమిండియా వుమెన్స్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టిన వేళ మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ హర్మన్‌ప్రీత్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''గూగుల్‌కు వెళ్లి ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ ఎవరు అని వెతికితే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేరు కనిపించడం లేదు. రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యాల పేర్లు మాత్రమే కనిపించాయి. ఈ సమస్యను మనమే సృష్టిస్తే.. దానిని పరిష్కరించడానికి ఒక మార్గం ఉంది. మహిళల క్రికెట్‌ కోసం అది చేద్దాం.#IndianCricketTeamCaptainHarmanpreetKaur on #Twitter #Quora #LinkedIn and #Reddit ఈ పదాలను అన్నింటిలో షేర్‌ చేసి చక్కదిద్దుకుందాం.'' అని ట్వీట్‌ చేశాడు.

ప్రస్తుతం యువరాజ్‌ చేసిన ట్వీట్‌ ఆలోచింపజేసేలా ఉంది. నిజమే టీమిండియా మహిళల క్రికెట్‌ను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈసారి మహిళల జట్టు టి20 వరల్డ్‌కప్‌ కొట్టాలని కోరుకుందాం. యువీ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. మరో మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా యువరాజ్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ సేమ్‌ వీడియోను షేర్‌ చేశాడు.

ఇక టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లిన భారత మహిళల జట్టు లీగ్‌ దశలో ఇంగ్లండ్‌ చేతిలో మినహా మిగతా అన్నింటిలోనూ విజయాలు సాధించింది. సోమవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో గెలిచి టీమిండియా సెమీస్‌కు ఎంటరైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement