KL Rahul: ఇక భరించలేం.. తొలగించాల్సిందే!

Trolls On-KL Rahul Failures Ban From-Team India Give Chance Shubman Gill - Sakshi

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులోనూ టీమిండియా విజయం సాధించి  అభిమానులను ఖుషీ చేసినప్పటికి ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్‌ హ్యాపీగా లేరు. అదే కేఎల్‌ రాహుల్‌ వైఫల్యం. టీమిండియా వైస్‌కెప్టెన్‌ తన ఫెయిల్యూర్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే కేఎల్‌ రూపంలో షాక్‌ తగిలింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.

అయితే ఈసారి అతని ఔట్‌కు దురదృష్టం కూడా తోడైంది. నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిన బంతి రాహుల్‌ ముందు ఫైన్‌ పాయింట్‌లో ఉన్న ఫీల్డర్‌ బూటుకు తాకి గాల్లోకి లేచింది. ఆ తర్వాత కీపక్‌ కేరీ ఏ పొరపాటు చేయకుండా క్యాచ్‌ అందుకున్నాడు. అంతే రాహుల్‌ కథ ముగిసింది. తొలి టెస్టులో 20 పరుగులు మాత్రమే చేసిన రాహుల్‌.. రెండో టెస్టులో మరింత దిగజారిపోయాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చచ్చీ చెడి 17 పరుగులు చేసిన రాహుల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అయితే కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. రాహుల్‌ వరుసగా విఫలమవుతున్నా జట్టు మేనేజ్‌మెంట్‌ అతనికి అవకాశాలు ఇస్తూనే వస్తోంది. 

ఇప్పటికైనా కేఎల్‌ రాహుల్‌ను పక్కకు తప్పించి యంగ్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు అవకాశమిస్తే మంచిది. రాహుల్‌ ఎన్ని మ్యాచ్‌లాడిన భారత్‌ స్కోరు 0/1, 50/1, 100/1 ఇలాగే కనిపిస్తుంది. ఆ ఒక్క వికెట్‌ కూడా కేఎల్‌ రాహుల్‌దే అయ్యుంటుంది. జట్టులో ఉన్నా లేనట్లే అన్నట్లుగా తయారైంది రాహుల్‌ ప్రస్తుత పరిస్థితి. అవకాశమిస్తే ఇరగదీస్తున్నాడా అంటే అదీ లేదు. అందుకే వైస్‌కెప్టెన్‌ బాధ్యతలు వేరొకరికి అప్పగించి రాహుల్‌ను టీం నుంచి తొలగించడమే ఉత్తమమని క్రీడా పండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టీమిండియా అభిమానులు కూడా రాహుల్‌ ఆటతీరుతో విసుగుచెందారు.అందుకే రెండో టెస్టులో టీమిండియా విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూనే కేఎల్‌ రాహుల్‌పై ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''ఇక భరించలేం.. కేఎల్‌ రాహుల్‌ను తొలగించాల్సిందే..'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: ఆసీస్‌ను భయపెట్టిన స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌

శభాష్‌ హిట్‌మ్యాన్‌.. పూజారా కోసం వికెట్‌ను త్యాగం చేసిన రోహిత్‌! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top