
యూరో ఛాంపియన్‌షిప్ టోర్నీ 2020లో ఇరు జట్ల ఫ్యాన్స్ సంబురాలు.. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇంగ్లండ్, స్కాట్లాండ్ ఫ్యాన్స్ స్టేడియం బయట ఒకరిపై ఒకరు దురుసుగా ప్రవర్తించుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రంతా వాళ్లకు అడ్డుగా నిలబడి జాగారం చేశారు.
లండన్: యూఈఎఫ్‌ఏ యూరో 2020 టోర్నీలో భాగంగా ఉత్కంఠంగా జరిగిన ఇంగ్లండ్ స్కాట్‌లాండ్ ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వెంబ్లే స్టేడియంలో ఇరు జట్లు తలపడి గోల్ కొట్టకపోవడంతో స్కోర్ బోర్డు 0-0 దగ్గరే ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియం బయట జరిగిన పరిణామాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇంగ్లండ్, టార్టన్ ఆర్మీ(స్కాట్లాండ్ మద్దతుదారులు) మధ్య మొదలైన చిన్న గొడవ.. స్కాట్లాండ్ సాకర్ ఫ్యాన్స్ చేరికతో ఘర్షణలకు దారితీయబోయింది. దీంతో రాత్రంతా పోలీసులు ఇరువర్గాల మధ్య అడ్డుగొడలా నిల్చుని ఉద్రికత్తలను తగ్గించే ప్రయత్నం చేశారు.
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో వేలాది మంది సాకర్ అభిమానులు లెయిసెస్టర్ స్క్వేర్ వద్ద గుమిగూడి పార్టీ చేసుకోవడం ప్రారంభించారు. ఆ టైంలో స్కాట్లాండ్‌కు మద్దతు తెలపడానికి వచ్చిన టార్టన్ ఆర్మీ(స్కాట్లాండ్ టీంకు సపోర్ట్‌గా పార్టీలు చేయడం, ఆ తర్వాత చెత్త ఏరడం వీళ్ల పని) సభ్యుడికి.. ఇంగ్లండ్ అభిమానులకు గొడవ జరిగింది. ఇది తెలిసి స్కాట్లాండ్ సాకర్ ఫ్యాన్స్ విలియం షేక్‌స్పియర్ విగ్రహం వద్ద టార్టన్‌తో కలిశారు. దీంతో గొడవ ముదిరే టైంకి పోలీసులు రంగంలోకి దిగారు.
కాగా, ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం 2 వేల టికెట్లు జారీ చేయగా.. అక్కడ 20వేలకు పైగా జనం గుమిగూడినట్లు పోలీసులు వెల్లడించారు. వాళ్లంతా మద్యం, డ్రగ్స్ మత్తులో దూకుడుగా వ్యవహరించారని, ఈ ఉద్రిక్తతలకు సంబంధించి ఇప్పటివరకు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వెల్లడించారు. అయితే అందులో ఇంగ్లండ్ అభిమానులు లేరని పోలీసులు చెప్పడం కొసమెరుపు. ఇక సోషల్ డిస్టెన్స్ పాటించనందుకు ఆ వేలమందిపై కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ గొడవకు ఆజ్యం పోసిందని చెబుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A Fight breaks out between England and Scotland Fans pic.twitter.com/INv0wVeCaL
— Subject Access (@SubjectAccesss) June 18, 2021