చహల్‌ ఎంగేజ్‌మెంట్‌.. రోహిత్‌, సెహ్వాగ్‌ ఫన్నీ మీమ్స్‌

Sehwag And Rohit Sharma Trolls Yuzvendra Chahal As He Announced His Engagement - Sakshi

టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు,కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మతో నిశ్చితార్థం జరిగిందని శనివారం చహల్‌ వెల్లడించారు. చహల్‌ అకస్మిక నిర్ణయంతో అటు అభిమానులతో పాటు ఇటు అతని సహచర ఆటగాళ్లు కూడా అవాక్కయ్యారు. ఏదేమైనా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న చహల్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
(చదవండి: ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా క్రికెటర్‌)

ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిపై సెటైర్లు వేసే చహల్‌కు అదే రీతిలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రోహిత్‌ ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేస్తూ..‘భాయ్ నిశ్చితార్థం చేసుకున్నందుకు కంగ్రాట్స్.. అంతా మంచే జరగాలిని కోరుకుంటున్నా'అని క్యాప్షన్‌ ఇచ్చాడు. అయితే కామెంట్ సింపుల్‌గానే ఉన్నా.. అతను షేర్ చేసిన మీమ్ మాత్రం నవ్వులు పూయిస్తోంది. 2050లో రాయల్‌చాలెంజర్స్ యువ అభిమానితో చహల్ అంటూ యుజీ పోలీకలతో ఉన్న ఓ ఓల్డ్‌మ్యాన్, యంగ్ మ్యాన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశాడు.
 

ఇక సెహ్వాగ్‌ మరో అడుగు ముందుకేసి.. నరేంద్ర మోదీ మీమ్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘వావ్‌ చహల్‌.. ఆపద సమయాన్ని అవకాశంగా మార్చు కుంటున్నావు’ అని చమత్కరించాడు. రోహిత్‌, సెహ్వాగ్‌ల ట్వీట్లు ప్రస్తుతం సోషల్‌ మీడియా వైరల్‌ అవుతున్నాయి. త్వరలో జరగబోయే ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూర్‌ తరపున చహల్‌ బరిలోకి దిగుతున్నాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top