Sanjana Ganesan's Old Tweet On Jasprit Bumrah Goes Viral Amid Marriage Rumours - Sakshi
Sakshi News home page

బుమ్రా ఆన్‌ ఫీల్డ్‌ మూడ్‌..  నా డైలీ మూడ్‌ ఒకేలా!

Mar 13 2021 6:16 PM | Updated on Mar 13 2021 7:50 PM

Sanjana Ganesans Old Tweet About Jasprit Bumrah Goes Viral - Sakshi

న్యూఢిల్లీ:  టీమిండియా పేస్‌ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా మ‌రికొద్ది రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్న‌ట్టు గత కొంతకాలంగా ప్ర‌చారం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ క్రమంలోనే  అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను బుమ్రా పెళ్లి చేసుకోనున్నాడ‌ని మొద‌ట్లో వార్త‌లు రాగా, ఆ త‌ర్వాత స్పోర్ట్స్ కామెంటేట‌ర్ సంజ‌నా గ‌ణేష‌న్‌తో వివాహం జ‌ర‌గ‌నుంద‌ని చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా వీరిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక్కడ చదవండి: బుమ్రాతో పెళ్లిపై అనుపమ తల్లి క్లారిటీ

ఆ సంగతి అలా ఉంచితే..  ఈ జ‌న‌వ‌రిలో .. బుమ్రా గురించి సంజ‌నా గ‌ణేషన్  ఓ ట్వీట్ చేయ‌గా, ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో బుమ్రా ప‌లు ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌గా, వీటిని ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో త‌న సోష‌ల్ మీడియాలో  షేర్ చేసింది. దీనికి మీ ఆదివారం బుమ్రా కంటే బాగా గ‌డిచిందా అనే కామెంట్ పెట్టారు.  అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన సంజ‌న .. బుమ్రా ఆన్ ఫీల్డ్ మూడ్, నా  డైలీ మూడ్ ఒకేలా స్వింగ్‌ అవుతాయంటూ కామెంట్ పెట్టారు.  దాంతో వీరి పెళ్లి వార్తలపై చర్చకు తెరలేపారు నెటిజన్లు. దీనిలో భాగంగా వీరికి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement