Shan Masood: ఘనంగా క్రికెటర్‌ పెళ్లి వేడుక.. జనవరి 27న రిసెప్షన్‌

Pakistan Cricketer Shan Masood Marries Lover-Nische Khan Peshawar Viral - Sakshi

పాకిస్తాన్‌ క్రికెటర్.. జట్టు వైస్‌కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ వివాహం పెషావర్‌లో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి ఫ్రెండ్‌, ప్రేయసి నిషే ఖాన్‌ను అతను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పాకిస్తాన్‌ క్రికెట్‌ నుంచి చీఫ్‌ సెలెక్టర్‌ షాహిద్‌ అఫ్రిది, ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌లు హాజరయ్యారు. కరాచీ వేదికగా జనవరి 27న గ్రాండ్‌గా రిసెప్షన్‌ వేడుక జరగనుంది. ఈ రిసెప్షన్‌కు పాక్‌ క్రికెటర్లు హాజరయ్యే అవకాశాలున్నాయి.

ఇక షాన్‌ మసూద్‌ పెళ్లి వేడుకను ఒక వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అయేమన్‌ మాలిక్‌ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షాన్‌ మసూద్‌, నిఖా షేన్‌ వివాహ వేడుకల ఫోటోలను పంచుకున్నాడు. కాగా కొత్త జంటకు మాజీ క్రికెట‌ర్లు కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అహ్మ‌ద్‌లతో పాటు ప‌లువురు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మ‌సూద్, నిషేతో త‌న రిలేష‌న్‌షిప్ గురించి ప్ర‌స్తావించాడు. నిషే త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెను మొద‌టిసారిగా లాహోర్‌లో క‌లిశాన‌ని చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్‌ జట్టులో మిడిలార్డ‌ర్‌ బ్యాట‌ర్ అయిన మ‌సూద్ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడాడు. టోర్నీలో పాకిస్థాన్ తరపున టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇక భార‌త్‌తో జరిగిన మ్యాచ్‌లో షాన్‌ మసూద్‌ హాఫ్ సెంచ‌రీ (52)తో రాణించాడు. ఇక ఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై 38 పరుగులు చేశాడు. పాక్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షాన్‌ మసూద్‌  28 టెస్టుల్లో 1500 పరుగులు, 19 టి20ల్లో 395 పరుగులు, ఆరు వన్డేల్లో 110 పరుగులు చేశాడు.

చదవండి: 'కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం'

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top