Nz Vs Ban 1st Test 2022: Bangladesh Creates History, Won The Match By 8 Wickets - Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ సంచలనం.. న్యూజిలాండ్‌పై ఘన విజయం.. సరికొత్త చరిత్ర

Jan 5 2022 7:50 AM | Updated on Jan 5 2022 3:15 PM

NZ Vs Ban 1st Test: Bangladesh Beat New Zealand By 8 Wickets Creates History - Sakshi

PC: NZ Cricket

న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ సంచలన విజయం... సరికొత్త చరిత్ర

Bangladesh Beat New Zealand By 8 Wickets In 1st Test: మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ సంచలన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో సొంత గడ్డపై ఆతిథ్య కివీస్‌ను మట్టి కరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మొట్టమొదటి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ను ఓడించి కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.

కాగా కివీస్‌ గడ్డపై బంగ్లాకు ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి విజయం కావడం గమనార్హం. మొమినల్‌ హక్‌ సారథ్యంలోని జట్టు బంగ్లాకు ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఈ రికార్డును సాధించింది. దీంతో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. వైవిధ్యమైన పేస్‌ బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ వెన్ను విరిచిన ఇబాదత్‌ హొస్సేన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఏడు వికెట్లతో మెరిసి అవార్డు అందుకున్నాడు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 328 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల విజృంభణతో 169 పరుగులకే చాపచుట్టేసింది. పర్యాటక బంగ్లా  458 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించగా... రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

చదవండి: Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్‌.. కానీ వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో..
Rassie van der Dussen Dismissal: శార్దూల్ బౌలింగ్‌లో ప్రొటిస్‌ ఆటగాడు అవుట్‌.. వివాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement