నేనేంటో నాకు తెలుసు.. వదిలిపెట్టను: స్వప్నాకు నందిని అగసార కౌంటర్‌ | Nandini Agasara Refutes Swapna Barman Transgender Allegations, To Take Up Issue With AFI - Sakshi
Sakshi News home page

Nandini Agasara Vs Swapna Barman: నేనేంటో నాకు తెలుసు.. అసలే మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు: స్వప్నాకు నందిని స్ట్రాంగ్‌ కౌంటర్‌

Oct 2 2023 2:12 PM | Updated on Oct 2 2023 5:22 PM

Nandini Agasara Refutes Swapna Barman Allegations Take Up Issue With AFI - Sakshi

నందిని అగసార- స్వప్నా బర్మన్‌ (PC: X)

స్వప్నా బర్మన్‌ చేసిన సంచలన ఆరోపణలను భారత అథ్లెట్‌ నందిని అగసార ఖండించింది. తన విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కౌంటర్‌ ఇచ్చింది. తానేంటో తనకు తెలుసునని.. ఒకవేళ స్వప్నా దగ్గర తనకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలని సవాల్‌ విసిరింది.

కాగా ఆసియా క్రీడలు-2023లో తెలంగాణకు చెందిన నందిని అగసార హెప్లథ్టాన్‌ విభాగంలో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. చైనాలోని హోంగ్జూలో ఏడు క్రీడాంశాలతో కూడిన హెప్టథ్టాన్‌లో సత్తా చాటి మెడల్‌ సాధించింది.

ఇదే ఈవెంట్లో వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన స్వప్నా బర్మన్‌ నాలుగోస్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ట్రాన్స్‌జెండర్‌ వల్ల తాను కాంస్యం కోల్పోయానంటూ సంచలన పోస్టుతో నందినిపై తీవ్ర ఆరోపణలు చేసింది.

ఓటమిని తట్టుకోలేని ఆమె విద్వేషంతో ఈ మేరకు చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది. నందినిని తక్కువ చేసేలా మాట్లాడిన స్వప్నా బర్మన్‌పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై తాజాగా స్పందించిన నందిని అగసార స్వప్నాకు దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చింది.

‘‘నేనేంటో నాకు తెలుసు. ఆమె దగ్గర నాకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. నేను కూడా నా దగ్గర దేశం కోసం గెలిచిన ఈ మెడల్‌ను చూపిస్తాను. దేశం కోసం ఆడాలన్నదే నా ధ్యేయం.

ఇప్పుడు మేము గెలిచాం. మా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయనుకుంటా. ఈ విషయాన్ని నేను భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య దృష్టికి తీసుకువెళ్తాను. ప్రస్తుతం నేను పతకం సాధించానన్న ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. 

మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. నేను ఇండియాకు వెళ్లిపోతున్నాను’’ అని నందిని అగసార పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా తెలంగాణకు చెందిన 20 ఏళ్ల నందిని మహిళల హెప్లథ్టాన్‌ విభాగంలో 5712 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. మరోవైపు స్వప్నా బర్మన్‌కు ఈ ఈవెంట్లో 5708 పాయింట్లు మాత్రమే వచ్చాయి.

చదవండి: కోహ్లికి నో ఛాన్స్‌! మరో టీమిండియా స్టార్‌కు చోటు.. ఆ ఐదుగురు అదుర్స్‌: బట్లర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement