Mohammed Shami sends David Warners stumps cartwheeling - Sakshi
Sakshi News home page

IND vs AUS: షమీ సూపర్‌ డెలివరీ.. ఆఫ్‌ స్టంప్‌ ఎగిరిపోయిందిగా! పాపం వార్నర్‌

Feb 9 2023 11:40 AM | Updated on Feb 9 2023 11:51 AM

Mohammed Shami sends David Warners stumps cartwheeling - Sakshi

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నాగ్‌పూర్‌ వేదికగా ప్రారంభమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు భారత పేసర్లు సిరాజ్‌, మహ్మద్‌ షమీ చుక్కలు చూపించారు. వీరిద్దరూ ఆరంభంలోనే ఆసీస్‌ ఓపెనర్లద్దరినీ పెవిలియన్‌కు పంపారు. దీంతో ఆసీస్‌ కేవలం 2 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

సూపర్‌ షమీ..
ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ను మహ్మద్‌ షమీ సంచలన బంతితో బోల్తా కొట్టించాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో షమీ వేసిన అద్భుతమైన లెంగ్త్ డెలివరీకి వార్నర్‌ దగ్గర సమాధానం లేకుండా పోయింది. షమీ వేసిన డెలివరీ వార్నర్‌ అపే లోపే బంతి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసేంది.

దీంతో వార్నర్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ క్రమంలో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన వార్నర్‌ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Suryakumar Yadav: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్‌ ఉద్విగ్న క్షణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement