
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జడేజా బౌలింగ్ మాయాజాలానికి స్టోయినిస్ షాక్ అయ్యాడు. తాను ఔటయ్యానా అని సందేహం వ్యక్తం చేయడం ఆసక్తి కలిగించింది.
విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ జడేజా వేశాడు. ఓవర్ ఐదో బంతిని జఫ్పా వేశాడు. జడ్డూ బంతిని లెగ్‌స్టంప్ దిశగా వేశాడు. స్టోయినిస్ ఫ్లిక్ చేద్దామని యత్నించాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో స్టోయినిస్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ విషయం తనకు తెలియక పక్కకు జరిగాడు.
కానీ అప్పటికే ధోని, జడ్డూ వద్దకు పరిగెత్తుకెళ్లడం చూసి వెనక్కి తిరిగి చూడగా బెయిల్స్ కిందపడడంతో షాక్ తిన్నాడు. 'ఏంటి నేను ఔటయ్యానా?' అనే సందేహంతో అంపైర్‌వైపు చూడగా ఔట్ అని సిగ్నలిచ్చాడు. దీంతో స్టోయినిస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేశారు. ''ఔటయ్యానన్న విషయం కూడా తెలియలేదా.. జడ్డూ బౌలింగ్ మయాజాలానికి హ్యాట్సాఫ్'' అంటూ పేర్కొన్నారు.
What a peach from Ravindra Jadeja.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2023
Marcus Stoinis' reaction says everything about it! pic.twitter.com/6xooN0BAM1