బార్సిలోనాకు గుడ్‌బై చెప్పిన మెస్సీ.. ఫేర్‌వెల్‌ సందర్భంగా కంటతడి | Lionel Messi In Tears At Barcelona Farewell Press Conference | Sakshi
Sakshi News home page

Viral Video: బార్సిలోనాకు గుడ్‌బై చెప్పిన మెస్సీ.. ఫేర్‌వెల్‌ సందర్భంగా కంటతడి 

Aug 8 2021 7:09 PM | Updated on Aug 8 2021 7:28 PM

Lionel Messi In Tears At Barcelona Farewell Press Conference - Sakshi

బార్సిలోనా: స్పానిష్ ఫుట్‌బాల్‌ క్లబ్ బార్సిలోనాతో త‌న‌కున్న రెండు ద‌శాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నాడు అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల‌ర్ లియోనెల్ మెస్సీ. ఆదివారం జరిగిన ఫేర్‌వెల్ సంద‌ర్భంగా మెస్సీ మాట్లాడుతూ.. క్లబ్‌ను వీడుతాన‌ని ఎన్నడూ ఊహించ‌లేదంటూ భావోద్వేగానికిలోనై కంట‌త‌డి పెట్టాడు. కెరీర్‌ ముగిసేంతవరకు బార్సిలోనాతోనే ఉందామ‌ని నిర్ణయించుకున్నానని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను క్లబ్‌ను వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయాడు. అయితే, ఎప్పుడో ఒక‌సారి తాను మ‌ళ్లీ తిరిగి వ‌స్తానని పేర్కొన్నాడు. తన జీవితం బార్కాలోనే ప్రారంభమైందని, ఇక్కడే చాలా నేర్చుకున్నానని, ఇప్పుడీ స్థాయిలో తానుండటానికి బార్కానే కార‌ణమని అన్నాడు. 

కాగా, క్లబ్ ఆర్థిక ప‌రిస్థితి స‌రిగా లేక‌పోవ‌డంతో మెస్సీతో కాంట్రాక్ట్‌ను కొన‌సాగించ‌డం లేద‌ని గురువారం బార్సిలోనా ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే, 17 సీజ‌న్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ త‌ర‌ఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 13 ఏళ్ల వ‌య‌సులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మెస్సీ ప్రయాణం మొద‌లైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement