Lieonal Messi: మెస్సీ చరిత్ర.. 34 ఏళ్ల వయసులో ఏడోసారి

Lionel Messi Creates Histrory Winning Mens Ballon DOr Award 7th Time - Sakshi

Lionel Messi.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక బాలెన్‌ డీ ఓర్‌ అవార్డును మెస్సీ ఏడోసారి సొంతం చేసుకున్నాడు.  ప్రాన్స్‌ ఫుట్‌బాల్‌ ఆధ్వర్యంలో ఫ్రాన్స్‌ వేదికగా జరిగిన అవార్డు కార్యక్రమంలో 30 మంది పోటీపడ్డారు.  చివరగా రాబర్ట్‌ లెవాండోస్కీ, జోర్గిన్హోలను వెనక్కి నెట్టి మెస్సీ బాలన్‌ డి ఓర్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంతకముందు మెస్సీ 2009, 2010,2011, 2012,2015, 2019లో ఈ అవార్డును ముద్దాడాడు.

చదవండి: Diego Maradona: టీనేజ్‌లో మారడోనా నాపై అత్యాచారం చేశాడు

గతేడాది మెస్సీ బార్సిలోనా తరపున 48 మ్యాచ్‌ల్లో 38 గోల్స్‌ చేశాడు. ఇక జూలైలో జరిగిన కోపా అమెరికా కప్‌ ఫైనల్లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ఫైనల్లో బ్రెజిల్‌ను ఓడించి కప్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు ఒక మెగా టైటిల్‌ను అందివ్వడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. ఇటీవలే బార్సిలోనాతో ఉన్న రెండు దశాబ్దాల బంధాన్ని మెస్సీ  వదులుకొన్న సంగతి తెలిసిందే. బార్సిలోనాను వీడి పారిస్‌ సెయింట్‌ జర్మెయిన్‌(పీఎస్‌జీ) తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇక మహిళల విభాగంలో స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అలెక్సియా ఫుటెల్లాస్‌ బాలన్‌ డీ ఓర్‌ అవార్డును గెలుచుకుంది. కాగా అలెక్సియా ఈ అవార్డు గెలుపొందడం ఇదే తొలిసారి. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక రొనాల్డో ఈ అవార్డును ఐదుసార్లు గెలిచాడు.

చదవండి: గోల్‌ కొట్టే అవకాశం.. ప్రత్యర్థి ఆటగాడికి గాయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top