Jofra Archer: ఫుల్‌ రిథమ్‌లో జోఫ్రా ఆర్చర్‌ | Jofra Archers Nasty Bouncer In Net Session Leaves Batsman | Sakshi
Sakshi News home page

Jofra Archer: ఫుల్‌ రిథమ్‌లో జోఫ్రా ఆర్చర్‌

Apr 28 2021 8:19 PM | Updated on Apr 29 2021 10:57 AM

Jofra Archers Nasty Bouncer In Net Session Leaves Batsman - Sakshi

ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఫుల్‌ రిథమ్‌లో బౌలింగ్‌ను ఆరంభించాడు.

లండన్‌: చేతి వేలికి సర్జరీ చేయించుకుని కొన్ని వారాల విరామం తర్వాత ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొన్న ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఫుల్‌ రిథమ్‌లో బౌలింగ్‌ను ఆరంభించాడు. ఈ మేరకు నెట్‌ సెషన్‌లో ఆర్చర్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను కౌంటీ జట్టు ససెక్స్‌ ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఆర్చర్‌ బౌన్సర్‌తో బౌలింగ్‌ను ప్రారంభించగా, ఆ బౌన్సర్‌ను  తప్పించుకునే క్రమంలో బ్యాట్స్‌మన్‌ అదుపు తప్పి కిందపడ్డాడు. కాగా, ఇన్‌టైమ్‌లో సదరు బ్యాట్స్‌మన్‌ తప్పించుకోవడంతో అతనికి ఎటువంటి గాయం కాలేదు.,. 

వచ్చేవారం ఆర్చర్‌ తన పూర్తిస్థాయి ట్రైనింగ్‌ను ఆరంభించినున్నట్లు ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ససెక్స్‌  ఆటగాడైన ఆర్చర్‌.. క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపింది.  గత నెలలో భారత్‌తో సిరీస్‌లో ఆర్చర్‌ చేతికి గాయమైంది.  దాంతో సర్జరీ అనివార్యం కావడంతో ఆర్చర్‌ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రధాన బౌలింగ్‌ ఆయుధమైన ఆర్చర్‌ దూరం కావడంతో ఆ జట్టు అతని లోటును పూడ్చటంలో పూర్తిగా సక్సెస్‌ కాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement