Prithvi Shaw: చెత్తగా ఆడుతున్నావు.. ఇక మారవా? అనూజ్‌ సంచలన ఫీల్డింగ్‌.. వీడియో వైరల్‌

IPL 2023 RCB Vs DC: Fans Roast Prithvi Shaw Failure Again Drop Him - Sakshi

IPL 2023- RCB Vs DC- Prithvi Shaw- Anuj Rawat: ఢిల్లీ ‍క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షాపై అభిమానులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా అతడిని ట్రోల్‌ చేస్తూ మండిపడుతున్నారు. ‘‘అసలు నీ ఆట తీరు ఎలా ఉందో చూసుకుంటున్నావా? మొన్నటిదాకా అలా.. ఈసారేమో మళ్లీ ఇలా డకౌట్‌’’ అంటూ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2023 సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో పృథ్వీ షా నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 12, 7, 0, 15.

అనూజ్‌ సంచలన ఫీల్డింగ్‌
తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు ఈ యువ ఓపెనర్‌. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ వేసిన సిరాజ్‌ బౌలింగ్‌లో నాలుగో బంతికి షా పరుగుకు యత్నించాడు. కానీ.. మైదానంలో పాదరసంలా కదిలిన ఆర్సీబీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అనూజ్‌ రావత్‌ ఏమాత్రం పొరపాటు చేయకుండా బాల్‌ను అందుకుని వికెట్లకు గిరాటేశాడు. 

సంచలన ఫీల్డింగ్‌తో ఢిల్లీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ పృథ్వీ షాను రనౌట్‌ చేశాడు. క్రీజులో అడుగుపెట్టేందుకు పరిగెత్తురావడంలో జాప్యం చేసిన పృథ్వీ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు. దీంతో ఢిల్లీ తొలి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయింది.

ఇకనైనా తప్పించండి
ఈ నేపథ్యంలో పృథ్వీ షాపై మండిపడుతున్నారు అభిమానులు. ‘‘నీకేమైంది పృథ్వీ షా.. ఇదేం చెత్త ఆట. షాట్ల ఎంపిక విషయంలో పొరపాట్లు. ఇప్పుడేమో రనౌట్‌గా వెనుదిరిగడం. ఇందుకేనా నీకు ఓపెనర్‌గా అవకాశాలు ఇస్తోంది ఢిల్లీ మేనేజ్‌మెంట్‌. ఇకనైనా అతడిని తప్పించి వేరే వాళ్లకు అవకాశాలు ఇవ్వండి’’ అని మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు.

పృథ్వీ షా రనౌట్‌.. వీడియో వైరల్‌
ఇక ఇంకొంతమంది నెటిజన్లేమో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆర్సీబీకి బ్రేక్‌ ఇచ్చిన అనూజ్‌ను ఆకాశానికెత్తుతున్నారు. ఈ క్రమంలో పృథ్వీ షా రనౌట్‌కు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుండగా.. వీరిద్దరి పేర్లు ట్రెండ్‌ అవుతున్నాయి.  కాగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

చదవండి: టీమిండియాకు శుభవార్త.. వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు బిగ్‌బూస్ట్‌! బీసీసీఐ కీలక ప్రకటన

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top