ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. నెహల్ వదేరా 21 బంతుల్లో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కామెరాన్ గ్రీన్ 33 పరుగులు, సూర్యకుమార్ 23 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, మోహిత్ శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు.
16 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 129/6
16 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వదేరా 34, పియూష్ చావ్లా 17 పరుగులతో ఆడుతున్నారు.
సూర్యకుమార్(23) ఔట్.. ఓటమి దిశగా ముంబై ఇండియన్స్
208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. 13 ఓవర్లు ముగిసేసరికి 90 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. 23 పరుగులు చేసిన సూర్యకుమార్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
59 పరుగులకే ఐదు వికెట్లు డౌన్
నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌ను దెబ్బకొట్టాడు. టిమ్ డేవిడ్‌ను డకౌట్ చేసిన నూర్.. అంతకముందు నిలకడగా ఆడుతున్న కామెరాన్ గ్రీన్‌ను నూర్ అహ్మద్ తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం ముంబై ఐదు వికెట్లు నష్టానికి 59 పరుగులు చేసింది.
తిలక్ వర్మ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన ముంబై
ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తిలక్ వర్మను రషీద్ ఖాన్ ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో ముంబై 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రెండో వికెట్ కోల్పోయిన ముంబై.. ఇషాన్(13) ఔట్
13 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి జోషువా లిటిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై రెండు వికెట్లు నష్టానికి 43 పరుగులు చేసింది.
రోహిత్(2) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ముంబై
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన రోహిత్ శర్మ హార్దిక్‌పాండ్యా  బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.

Photo Credit : IPL Website
గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.  గిల్ 56 పరుగులతో రాణించగా.. డేవిడ్ మిల్లర్ 22 బంతుల్లో 46 పరుగులు, అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 42 పరుగులు రాణించారు. చివర్లో రాహుల్ తెవాటియా 5 బంతుల్లో మూడు సిక్సర్లతో 20 పరుగులు చేయడంతో గుజరాత్ స్కోరు 200 మార్క్ దాటింది.

Photo Credit : IPL Website
18 ఓవర్లలో గుజరాత్ 172/4
18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ 42, డేవిడ్ మిల్లర్ 34 పరుగులతో ఆడుతున్నారు.

Photo Credit : IPL Website
15 ఓవర్లలో గుజరాత్ 130/4
15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ 19, డేవిడ్ మిల్లర్ 17 పరుగులతో ఆడుతున్నారు.

Photo Credit : IPL Website
నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన విజయ్ శంకర్ చావ్లా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.

Photo Credit : IPL Website
పాండ్యా(13) ఔట్.. 10 ఓవర్లలో గుజరాత్ 84/2
10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. గిల్ 30 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకోగా.. విజయ్ శంకర్ 14 పరుగులతో ఆడుతున్నాడు. అంతకముందు పాండ్యా 13 పరుగులు చేసి పియాష్ చావ్లా బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

Photo Credit : IPL Website
ఆరు ఓవర్లలో గుజరాత్ స్కోరు 50/1
ఆరు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. పాండ్యా 13, శుబ్‌మన్ గిల్ 31 పరుగులతో ఆడుతున్నారు.

Photo Credit : IPL Website
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాహా(4) ఔట్
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సాహా అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది

Photo Credit : IPL Website
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం 35వ మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహండార్ఫ్
#MumbaiIndians have opted to bowl first in Ahmedabad 🏟️
Watch the side collide with the Titans 💥#GTvMI #TATAIPL #IPL2023 #IPLonJioCinema | @mipaltan @gujarat_titans pic.twitter.com/AQhfp50wHo
— JioCinema (@JioCinema) April 25, 2023
వరుస విజయాలతో ముంబై ఇండియన్స్ జోరుమీద ఉండగా.. అటు గుజరాత్ టైటాన్స్ కూడా లక్నోతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో చిన్న లక్ష్యాన్ని కాపాడుకొని మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. గత రికార్డులు పరిశీలిస్తే ముంబై ఇండియన్స్‌దే పైచేయిగా ఉంది. గత సీజన్‌లో ఇరుజట్లు ఒక్కసారి మాత్రమే తలపడగా.. ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది.
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
