IPL 2022: అతడి కెప్టెన్సీ భేష్‌ ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ వాళ్లదే: టీమిండియా దిగ్గజం

IPL 2022: Sunil Gavaskar Predicts Delhi Might Win Maiden Title This Time - Sakshi

IPL 2022 Winner Prediction: రిషభ్‌ పంత్‌.. టీమిండియా యువ సంచలనం, స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌... ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌​-2021 సీజన్‌కు గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కావడంతో అతడి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పగ్గాలు చేపట్టాడు పంత్‌. జట్టును విజయపథంలో నడిపిస్తూ సత్తా చాటాడు. 

ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ రెండో అంచెకు అందుబాటులోకి వచ్చినా ఢిల్లీ పంత్‌నే సారథిగా కొనసాగించింది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు పంత్‌. ఇక రిటెన్షన్‌లో భాగంగా శ్రేయస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ వదిలేయడంతో వేలంలోకి రాగా ఇప్పుడు అతడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ అయ్యాడు. దీంతో పంత్‌కు పోటీ లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గావస్కర్‌ మాట్లాడుతూ.. ఈసారి ఢిల్లీ ట్రోఫీ గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేశారు. పంత్‌ సారథ్యంలోని ఈ జట్టు టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటని పేర్కొన్నారు. తన కెప్టెన్సీ నైపుణ్యాలతో ఢిల్లీకి మొట్టమొదటి ఐపీఎల్‌ కప్‌ అందించగల సత్తా పంత్‌కు ఉందని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు గావస్కర్‌ స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడుతూ.. ‘‘గత సీజన్‌లో తన ప్రతిభతో జట్టును ప్లే ఆఫ్స్‌నకు తీసుకువెళ్లిన పంత్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. టీమిండియా తరఫున ఇటీవల ఆడిన మ్యాచ్‌లలో అదరగొట్టాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.

తద్వారా తన కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు బలంగా కనిపిస్తోంది. కాబట్టి ఈసారి ఢిల్లీ తమ తొలి టైటిల్‌ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి’’ అని తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇక మార్చి 27న ఢిల్లీ ముంబై ఇండియన్స్‌తో తమ మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. ఇందుకోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.

చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై సంచలన విజయం.. వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ టాప్‌లో బంగ్లాదేశ్‌! టీమిండియా ఎక్కడ?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top