అంపైర్‌ వార్నింగ్‌.. దెబ్బకి బౌలింగ్‌ మార్చేశాడు! | IPL 2021: Umpire Warns Riyan Parag For Bowling Action | Sakshi
Sakshi News home page

అంపైర్‌ వార్నింగ్‌.. దెబ్బకి బౌలింగ్‌ మార్చేశాడు!

Apr 12 2021 10:19 PM | Updated on Apr 13 2021 10:23 AM

IPL 2021: Umpire Warns Riyan Parag For Bowling Action - Sakshi

ముంబై: మనం ఇటీవల కాలంలో రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ను తరుచు చూస్తున్నాం. బ్యాట్స్‌మన్‌ను కన్‌ఫ్యూజ్‌ చేయడం కోసం ఈ తరహా బౌలింగ్‌ను ఎక్కువగా చేస్తున్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, కేదార్‌ జాదవ్‌లు కూడా ఈ తరహా బౌలింగ్‌ వేసిన జాబితాలో ఉన్న ప్రముఖ క్రికెటర్లు.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేసి విమర్శలు పాలయ్యాడు. టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. అశ్విన్‌ బౌలింగ్‌ను  తప్పుబట్టాడు.  ఆఫ్‌ స్పిన్‌ను వదిలేసి ఈ బౌలింగ్‌ వేస్తున్నావేంటి బాబూ అని విమర్శించాడు. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రియాన్‌ పరాగ్‌ కూడా ఈ తరహా బౌలింగ్‌ వేయబోయాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో భాగంగా గేల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌కు యత్నించాడు పరాగ్‌. 

10 ఓవర్‌ మూడో బంతిని రౌండ్‌ ఆర్మ్‌ బంతిగా వేశాడు. ఆ క్రమంలో అతని మోచేతి గ్రౌండ్‌కు దాదాపు సమాంతరంగా ఉండటంతో అంపైర్‌ రంగంలోకి దిగాడు.  ఆ బంతిని ఉద్దేశిస్తూ.. జాగ్రత్త.. అంతలా రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేస్తే నిబంధనలకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని వార్నింగ్‌ ఇచ్చాడు. దాంతో వెంటనే పరాగ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ మార్చేశాడు. తన మునపటి స్టైల్‌ బౌలింగ్‌ వేశాడు. అయినప్పటికీ క్రిస్‌ గేల్‌ వికెట్‌ను సాధించాడు,. ఆ ఓవర్‌ ఐదో బంతిని గేల్‌ భారీ షాట్‌ ఆడగా బెన్‌ స్టోక్స్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు.  లాంగాన్‌ వైపు భారీగా కొట్టిన ఆ షాట్‌ను స్టోక్స్‌ జారవిడచకుండా పట్టుకోవడంతో గేల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో 40 పరుగుల వ్యక్తి గత స్కోరు డేంజర్‌ మ్యాన్‌ గేల్‌ పెవిలియన్‌ చేరాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement