India Vs England 2nd ODI: రెండో వన్డేలో ఇంగ్లండ్‌ ఘన విజయం

India Vs England 2nd ODI Match Live Updates And Highlights - Sakshi

రెండో వన్డేలో ఇంగ్లండ్‌ ఘన విజయం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు ఓటమిపాలైంది. ప్రత్యర్థి జట్టు విధించిన 247 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఆతిథ్య జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా
23 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 12 బంతుల్లో 1 పరుగు, హార్దిక్‌ పాండ్యా 31 బంతుల్లో 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 29 బంతుల్లో 27 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.

లక్ష్యచేధనలో తడబడుతున్న టీమిండియా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు 10.2 ఓవర్లు ముగిసే సమయానికి 29 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ శర్మ(0), శిఖర్‌ ధావన్‌ (9), రిషబ్‌ పంత్‌ (0) పరుగులు చేసి ఔట్‌ అయ్యారు. విరాట్‌ కోహ్లీ 21 బంతుల్లో 15 పరుగులు, సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.

ఇంగ్లండ్‌ 246 ఆలౌట్‌.. టీమిండియా టార్గెట్‌ 247
►టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. మొయిన్‌ అలీ 47 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్‌ విల్లే 41, జానీ బెయిర్‌ స్టో 38, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 33 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో చహల్‌ 4, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా చెరో రెండు వికెట్లు తీయగా.. మహ్మద్‌ షమీ, ప్రసిధ్‌ కృష్ణ చెరొక వికెట్‌ తీశారు. 

మొయిన్‌ అలీ(47) ఔట్‌.. ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
►నిలకడగా ఆడుతున్న మొయిన్‌ అలీ(47 పరుగులు) చహల్‌ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. డేవిడ్‌ విల్లే 25, క్రెయిగ్‌ ఓవర్టన్‌(0) క్రీజులో ఉన్నారు.

నిలదొక్కుకున్న ఇంగ్లండ్‌.. 41 ఓవర్లలో 208/6
►41 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ 46, డేవిడ్‌ విల్లే 25 పరుగులతో ఆడుతున్నారు.

కష్టాల్లో ఇంగ్లండ్‌.. డేంజరెస్‌ లివింగ్‌స్టోన్‌ ఔట్‌
►ఇంగ్లండ్‌ను హార్ధిక్‌ పాండ్యా మరోసారి దెబ్బకొట్టాడు. డేంజరెస్‌ లివింగ్‌స్టోన్‌ (33)ను పెవిలియన్‌ బాట పట్టించాడు. అంతకుముందు రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌గా మలచిన లివింగ్‌స్టోన్‌.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి  శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 29 ఓవర్ల ఇంగ్లండ్‌ స్కోర్‌ 148/6, క్రీజ్‌లో మొయిన్‌ అలీ (12), డేవిడ్‌ విల్లే ఉన్నారు.  

చహల్‌ దెబ్బ.. ఐదో వికెట్‌ డౌన్‌
►టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ లార్డ్స్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న చహల్‌ తాజాగా బెన్‌ స్టోక్స్‌ రూపంలో మూడో వికెట్‌ తీసుకున్నాడు. 21 పరుగులతో నిలకడగా ఆడుతున్న స్టోక్స్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ 3, మొయిన్‌ అలీ 2 పరుగులతో ఆడుతున్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
►టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో 4 పరుగులు చేసిన బట్లర్‌ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. అంతకముందు టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. ముందు 38 పరుగులు చేసిన బెయిర్‌ స్టోను.. ఆ తర్వాతి ఓవర్లో 11 పరుగులు చేసిన రూట్‌ను పెవిలియన్‌ చేర్చాడు. 

13 ఓవర్లలో ఇంగ్లండ్‌ 63/1
►13 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 63 పరుగులు చేసింది. బెయిర్‌ స్టో 31, జో రూట్‌ 8 పరుగులతో ఆడుతున్నారు.

జేసన్‌ రాయ్‌(23) ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
►జేసన్‌ రాయ్‌(23 పరుగులు) రూపంలో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో రాయ్‌ సూర్యకుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. బెయిర్‌ స్టో 17 పరుగులతో ఆడుతున్నాడు.

7 ఓవర్లలో ఇంగ్లండ్‌ 40/0
►ఏడు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ 23, జానీ బెయిర్‌ స్టో 16 పరుగులతో ఆడుతున్నారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా
►టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య రెండో వన్డే ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలి వన్డేలో బౌలింగ్‌ మాయాజాలంతో ఘన విజయం అందుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజెక్కించుకోవాలని భావిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్‌ మాత్రం​ ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇక ఇంగ్లండ్‌ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. కాగా తొలి వన్డేకు దూరమైన కోహ్లి రెండో వన్డేలో బరిలోకి దిగనున్నాడు.

ఇంగ్లండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ

టీమిండియా: రోహిత్ శర్మ(సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top