Shubman Gill: ఈ ఏడాది ఇప్పటికే 5 సెంచరీలు! గిల్‌ అరుదైన రికార్డు.. పిన్నవయస్కుడైన ఓపెనర్‌గా

Gill Becomes 2nd Youngest Indian Opener Test Century Vs Australia All Records - Sakshi

India vs Australia, 4th Test- Shubman Gill Century Records: 235 బంతులు.. 12 ఫోర్లు.. ఒక సిక్సర్‌.. 128 పరుగులు.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ నమోదు చేసిన స్కోరు. ఈ గణాంకాలు గిల్‌ కెరీర్‌లో చిరస్మరణీయంగా మిగిలిపోతాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే టెస్టుల్లో సొంతగడ్డపై మొదటి శతకం.. ఓవరాల్‌గా టెస్టుల్లో ఇది రెండోది... 

ఇది ఐదవది
అదే విధంగా.. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో తొలి శతకం. అది కూడా జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించే క్రమంలో సాధించిన కీలక సెంచరీ! అంతేకాదు ఈ ఏడాది ఐదో శతకం. అవును.. 2023లో గిల్‌ ఇప్పటి వరకు ఐదు సెంచరీలు సాధించగా.. టీమిండియా మిగతా బ్యాటర్లంతా కలిపి సాధించిన శతకాలు ఐదు! దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా గిల్‌ ఘనత సాధించాడు.

నాలుగో ఆటగాడిగా
రోహిత్‌ శర్మ, సురేశ్‌ రైనా, కేఎల్‌ రాహుల్‌ తర్వాత క్యాలెండర్‌ ఇయర్‌లో ఈ ఫీట్‌ నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. కాగా అహ్మదాబాద్‌ టెస్టులో ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 194 బంతుల్లో(62వ ఓవర్లో) 100 పరుగుల మార్కు అందుకున్న శుబ్‌మన్‌ గిల్‌.. అత్యంత పిన్న వయసులో ఆస్ట్రేలియా మీద సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు.

రెండో భారత ఓపెనర్‌గా
23 ఏళ్ల వయసులో గిల్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఈ జాబితాలో కేఎల్‌ రాహుల్‌ ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో మూడో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.

ఇక 24 ఏళ్ల వయసు కంటే ముందు ఆస్ట్రేలియాపై టెస్టుల్లో శతకాలు బాదిన భారత బ్యాటర్లు వీరే!
రిషభ్‌ పంత్‌- 159 నాటౌట్‌- సిడ్నీ- 2019
సచిన్‌ టెండుల్కర్‌- 148 నాటౌట్‌- సిడ్నీ- 1992
జీఆర్‌ విశ్వనాథ్‌- 137 కాన్పూర్‌- 1969
మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ- 128 నాటౌట్‌- చెన్నై- 1964
దత్తు ఫాద్కర్‌- 123- అడిలైడ్‌- 1948
విరాట్‌ కోహ్లి- 116- అడిలైడ్‌- 2012
సచిన్‌ టెండుల్కర్‌- 114- పెర్త్‌- 1992
దిలీప్‌ వెంగ్‌సర్కార్‌- 112- బెంగళూరు- 1979
కేఎల్‌ రాహుల్‌ - 110- సిడ్నీ 2015.

చదవండి: Ind Vs Aus: కోహ్లికి సాధ్యం కాలేదు.. పుజారా సాధించాడు! ‘తొలి బ్యాటర్‌’గా..
Virat Kohli: కోహ్లి ఖాతాలో మరో అరుదైన రికార్డు! ప్రస్తుతానికి పోటీ ఆ ఒక్కడే!
Shubman Gill- Kohli: ఆసీస్‌కు దీటుగా బదులు.. గిల్‌ తొలి శతకం.. కోహ్లి రియాక్షన్‌ వైరల్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top