IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు ఊహించని షాకివ్వనున్న గ్యారీ కిర్‌స్టన్‌..!

Gary Kirsten To Step Down As Gujarat Titans Coach After IPL 2022 Says Reports - Sakshi

Gary Kirsten To Step Down As Gujarat Titans Coach: ఐపీఎల్ 2022 సీజన్‌ ద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ లీగ్‌ మొదటి దశ మ్యాచ్‌లు ముగిసే సమయానికి వరుస విజయాలతో (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ బరిలోకి దిగిన ఆ జట్టును బ్యాటింగ్‌ కోచ్‌, మెంటార్‌ గ్యారీ కిర్‌స్టన్‌ అద్భుతమైన వ్యూహా రచనలతో సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాడు. కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా, ఇతర ఆటగాళ్లను సమన్వయం చేసుకుని గుజరాత్‌ టైటాన్స్‌ను టైటిల్‌ వేటలో ముందువరుసలో ఉంచాడు.

కాగా, తాజాగా మారిన సమీకరణల కారణంగా అతను గుజరాత్‌ టైటాన్స్‌ను షాకివ్వనున్నాడని తెలుస్తోంది. అతనికి ఇంగ్లండ్‌ ప్రధాన కోచ్‌ పదవి ఆఫర్‌ రావడంతో త్వరలోనే గుజరాత్‌ టైటాన్స్‌ కోచింగ్, మెంటార్‌ బాధ్యతలకు గుడ్‌బై చెప్పనున్నాడని సమాచారం. ఐపీఎల్‌ 2022 సీజన్‌తో అతను గుజరాత్‌తో బంధం తెంచుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌గా అతని పేరు అధికారికంగా వెలువడితే కిర్‌స్టన్‌ ఆ జట్టుతో కలవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుతో ఒప్పందం మేరకు అతడు ఇంగ్లండ్ కోచ్‌గా ఉండగా మరే జట్టుకు పనిచేసే అవకాశం ఉండదు. దీంతో కిర్‌స్టన్‌ త్వరలోనే ఐపీఎల్‌ను వీడతాడన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈసీబీ కిర్‌స్టన్‌ను హెడ్ కోచ్‌గా  అధికారికంగా ప్రకటించినప్పటికీ, అతను ఐపీఎల్‌ తర్వాతే ఆ జట్టుతో కలుస్తాడు. ఎందుకంటే, ఐపీఎల్‌ 2022 సీజన్‌ మే 29తో ముగియనుండగా, ఇంగ్లండ్ జట్టు జూన్ 2 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. కాగా, కిర్‌స్టన్‌ మార్గదర్శకత్వంలోనే టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన విషయం తెలిసిందే. 
చదవండి: ఆ మ్యాచ్ చూస్తూ రిమోట్లు, బాటిళ్లు పగులగొట్టా: రికీ పాంటింగ్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top