పడిక్కల్‌పై గంగూలీ ప్రశంసలు | Enjoyed Watching Devdutt Padikkal Play, Ganguly | Sakshi
Sakshi News home page

పడిక్కల్‌పై గంగూలీ ప్రశంసలు

Sep 22 2020 7:52 PM | Updated on Sep 22 2020 11:27 PM

Enjoyed Watching Devdutt Padikkal Play, Ganguly - Sakshi

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ యువ కెరటం దేవదూత్‌ పడిక్కల్‌ తన అరంగేట్రం ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే రాణించడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రశంసలు వర్షం కురిపించాడు.ఈ యువ ఆటగాడి ఆటను తాను ఎంతో ఎంజాయ్‌ చేశానంటూ కొనియాడాడు. ఎడమచేతి ఆటగాడైన పడిక్కల్‌ బ్యాటింగ్‌లోని గ్రేస్‌ అద్భుతంగా ఉందన్నాడు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన గంగూలీ.. ఆర్సీబీకి ట్యాగ్‌ చేశాడు. ఇదిలా ఉంచితే, నిన్న మ్యాచ్‌ తర్వాత పడిక్కల్‌ మాట్లాడుతూ.. ‘ ఆర్సీబీ తరపున అరంగేట్రం చేస్తున్నానన్న వార్త వినగానే చాలా ఆందోళనకు గురయ్యా.

నా రూమ్‌లోకి వెళ్లిపోయా. హైదరాబాద్‌తో మ్యాచ్‌ ఆరంభమైన తర్వాత సెటిల్‌ అయ్యా. తొలి రెండు బంతుల్ని ఎదుర్కొన్న తర్వాత ఫర్వాలేదనిపించింది. గత నెల నుంచి ఇక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్నా. విరాట్‌ భయ్యా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. కోహ్లి నుంచి నేను చాలా నేర్చుకున్నా.నేను కోహ్లిని కలిసిన ప్రతీసారి ఏదొక విషయం అడుగుతూ నేర్చుకోవడానికి యత్నించా. ఇక ఫించ్‌ కలిసి ఓపెనింగ్‌ రావడం నిజంగానే గొప్పగా అనిపించింది. నేను తొందరగా పరుగులు చేయడాన్ని ఫించ్‌ అర్థం చేసుకున్నాడు. నాకు స్ట్రైకింగ్‌ ఇస్తే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు’ అని తెలిపాడు. తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించి మంచి ఆరంభాన్ని అందించాడు. 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులతో ఆకట్టుకున్నాడు.(చదవండి: ఖతర్నాక్‌ కుర్రాడు.. పడిక్కల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement