IPL 2023 RCB Vs DC: Virat Kohli Stare Looks To Sourav Ganguly, Refuses To Shake Hands - Sakshi
Sakshi News home page

Virat Kohli: గంగూలీవైపు కోపంగా.. కనీసం షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేదు!

Apr 15 2023 9:08 PM | Updated on Apr 17 2023 2:43 PM

Virat Kohli Stare Looks-Doesnt Shake-Hands-Sourav Ganguly RCB Vs DC - Sakshi

Photo: IPL Twitter

టీమిండియా స్టార్‌.. విరాట్‌ కోహ్లి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మధ్య విబేధాలు ఉన్నాయన్నది బహిరంగ విషయం. కోహ్లి కెప్టెన్సీ తొలగింపులో పరోక్షంగా గంగూలీ పాత్ర ఉందన్నది అందరికి తెలిసిందే. దాదా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కోహ్లి టి20 కెప్టెన్‌గా తప్పుకున్నాడు.

ఆ తర్వాత కనీసం సమాచారం ఇవ్వకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో తొలిసారి కోహ్లి, గంగూలీ మధ్య విబేధాలు బయటికి వచ్చాయి. కోహ్లి ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ కెప్టెన్సీ తొలగింపు విషయాన్ని పేర్కొన్నాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. 


Photo: IPL Twitter

తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఈ ఇ‍ద్దరు మరోసారి ఎదురుపడ్డారు. గంగూలీ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్‌ సందర్భంగా కోహ్లి గంగూలీని కోపంగా చూస్తూ ఇచ్చిన లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సిరాజ్‌ బౌలింగ్‌లో అమన్‌ హకీమ్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో బౌండరీ దగ్గర కోహ్లికి దొరికిపోయాడు. ఇదే సమయంలో ఢిల్లీ డగౌట్‌ దగ్గరే ఉన్న కోహ్లి వెనక్కి నడుచుకుంటూ వెళ్లి దాదావైపు ఒక లుక్‌ ఇచ్చాడు. అటు గంగూలీ కూడా కోహ్లిని సీరియస్‌గానే చూశాడు. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు మరోసారి ఎదురుపడ్డారు.

ఈసారి కోహ్లి గంగూలీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు నిరాకరించాడు. ఆర్‌సీబీ మ్యాచ్‌ గెలిచిన తర్వాత ఇరుజట్లు ఒకరినొకరు అభినందించుకుంటున్న సమయంలో పాంటింగ్‌ వెనకాలే వచ్చిన గంగూలీ వచ్చాడు. పాంటింగ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇ‍‍చ్చిన కోహ్లి గంగూలీ రాగానే పాంటింగ్‌తో కోహ్లి ఏదో మాట్లాడాడు. దీంతో దాదా కోహ్లికి చేయి ఇవ్వకుండా పక్కకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''కోహ్లి ఇంకా పాత గాయం మరిచిపోలేదనుకుంటా'' అని కామెంట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement