IND Vs SA Boxing Day Test: మూడేళ్ల తర్వాత రీఎంట్రీ.. నోర్ట్జే స్థానంలో

 Duanne Oliver Set Comeback After 3 Years In Tests For SA Vs IND 1st Test - Sakshi

Duanne Olievier Set Comeback For SA In Boxing Day Test Vs IND.. టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ అన్‌రిచ్‌ నోర్ట్జే గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. కాగా గాయపడ్డ అతని స్థానంలో కొత్త ఆటగాడిని ఎంపిక చేసేందుకు సీఎస్‌ఏ ఆసక్తి చూపలేదు. దీంతో తొలి టెస్టుకు నోర్జ్టే స్థానంలో ఎవరొస్తారనే ఆసక్తి  నెలకొంది. ఈ సమయంలో డ్యుయన్నే ఓలివర్‌ పేరు వినిపిస్తుంది. ఇదే నిజమైతే దాదాపు మూడేళ్ల తర్వాత సౌతాఫ్రికా తరపున ఓలివర్‌ టెస్టు మ్యాచ్‌ ఆడనున్నాడు. ఇప్పటివరకు ప్రొటీస్‌ తరపున 10 టెస్టుల్లో 48 వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడ, లుంగీ ఎన్గిడితో కలిసి ఓలివర్‌ పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. 

చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాకు బిగ్‌షాక్‌.. గాయంతో స్టార్‌ పేసర్‌ దూరం

కాగా 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన ఓలివర్‌.. 2018లో చివరిసారి పాకిస్తాన్‌తో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టును ఆడాడు. కాగా ఓలివర్‌ ఆ ఆ టెస్టులో విశేషంగా రాణించాడు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఓలివర్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్‌తో జరిగిన మూడు టె​స్టుల సిరీస్‌లో 24 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2019  జనవరిలో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే తరచూ గాయాల బారీన పడుతూ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఓలివర్‌ బాక్సింగ్‌ డే టెస్టు ద్వారానే ఎంట్రీ ఇస్తుండడం విశేషం. 

టీమిండియాతో ఆడబోయే సౌతాఫ్రికా జట్టు(అంచనా):
డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్క్రమ్‌, కీగన్‌ పీటర్సన్‌, వాన్‌డర్‌ డుసెన్‌, కైల్‌ వెరిన్నే, క్వింటన్‌ డికాక్‌, వియాన్‌ ముల్డర్‌, కేశవ్‌ మహారాజ్‌, కగిసో రబాడ, డ్యుయన్నే ఓలివర్‌, లుంగీ ఎన్గిడి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top