ధోని సూపర్‌ డైవ్‌ !

dhoni stunning catch against kkr  - Sakshi

ఢిల్లీ: కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ధోని డైవ్‌ వేసి క్యాచ్‌ పట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌ ఓడినప్పటికీ ధోని పట్టిన ఈ క్యాచ్‌కు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. వయస్సు కేవలం ఒక అంకె మాత్రమే అని కామెంట్లు చేస్తున్నారు. డ్వైన్‌ బ్రావో తన ఆఖరి ఓవర్‌లో శివమ్‌ మావీకి బంతి వేస్తుండగా 'స్లో బాల్‌' వేయమని ధోని సిగ్నల్‌ ఇచ్చాడు. దాంతో ఆఫ్‌సైడ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన శివమ్‌ మావి బ్యాట్‌కు ఎడ్జ్‌ అయి బంతి ధోని చేతికి వెళ్లింది. మొదట బంతిని మిస్‌ చేసినా ఆ తర్వాత డైవ్‌ చేసి పట్టుకున్నాడు. 

జడేజా సూపర్‌ క్యాచ్‌...

ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో దిగిన సునిల్‌ నరైన్‌, కరణ్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లాంగ్‌ ఆన్‌, 'డీప్‌ మిడ్‌వికెట్‌' మధ్యలో షాట్‌ ఆడబోయి జడేజా చేతికి చిక్కాడు. జడేజా అద్భుతమైన డైవ్‌ వేసి క్యాచ్‌ పట్టుకున్నాడు. ఐతే బౌండరీ లైన్‌ దగ్గర డైవ్‌ వేయడంతో జడేజా లైన్‌ను టచ్‌చేసే అవకాశం ఉంది. లాంగ్‌ ఆన్‌లో ఉన్న డూప్లెసిస్‌ జడేజా వద్దకు పరుగెత్తగా బంతిని అతడి చేతికి అందించాడు. సూపర్‌ క్యాచ్‌ అంటూ తమ కామెంట్లతో నెటిజన్లు జడేజాను ప్రశంచించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top