IPL 2023, MI Vs CSK: MS Dhoni Master Mind After Umpire Gives Wide Reviews Caught Behind Suryakumar Yadav Catch Out - Sakshi
Sakshi News home page

DRS అంటే 'ధోని రివ్యూ సిస్టమ్‌'.. కొనసాగుతున్న సూర్య వైఫల్యం

Apr 8 2023 8:47 PM | Updated on Apr 9 2023 11:01 AM

Photo: IPL Twitter - Sakshi

సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అందులో 99 శాతం సరైన ఫలితమే కనిపిస్తుంది. ఇప్పటికే ఇది చాలాసార్లు నిరూపితమైంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు.. ఐపీఎల్‌ ఇలా ఏదైనా సరే తన మాస్టర్‌ మైండ్‌తో మ్యాచ్‌లు తారుమారు చేసిన సందర్బాలు కోకొల్లలు. తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ధోని మరోసారి తన మాస్టర్‌మైండ్‌ పవర్‌ రుచి చూపించాడు. 


Photo: IPL Twitter

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ మిచెల్‌ సాంట్నర్‌ వేశాడు.  అంతకముందు ఓవర్లోనే ఇషాన్‌ కిషన్‌ పెవిలియన్‌ చేరడంతో సూర్యకుమార్‌ క్రీజులోకి వచ్చాడు. ఇక ఓవర్లో సాంట్నర్‌ వేసిన రెండో బంతి వైడ్‌ బాల్‌ అనే ఉద్దేశంతో సూర్య వదిలేయడం.. ధోని షార్ప్‌గా స్పందించి బంతి అందుకోవడం జరిగిపోయాయి.


Photo: IPL Twitter

దీంతో ధోని అంపైర్‌కు క్యాచ్‌ ఔట్‌కు అప్పీల్‌ చేశాడు. అయితే గ్లోవ్స్‌కు తగిలి వెళ్లినట్లు అనిపించడంతో సూర్య కూడా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ అంపైర్‌ వైడ్‌ ఇవ్వడంతో సూర్య ఆగిపోయాడు. వెంటనే ధోని క్యాచ్‌ కోసం రివ్యూ కోరాడు.రిప్లేలో  బంతి గ్లోవ్స్‌కు తగిలినట్లు తేలింది. దీంతో సూర్యకు నిరాశ తప్పలేదు. ఇక ధోని రివ్యూ తీసుకోవడంపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. డీఆర్‌ఎస్‌ అంటే 'ధోని రివ్యూ సిస్టమ్‌" అంటూ కామెంట్‌ చేశారు.


Photo: IPL Twitter

ఇక ఐపీఎల్‌లో సూర్యకుమార్‌ వైఫల్యం కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన సూర్యకుమార్‌ ఈ మ్యాచ్‌లో దారుణంగా ఆడి ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ సూర్యకుమార్‌ దారుణ ప్రదర్శన కనబరిచాడు. టి20లు మాత్రమే బాగా ఆడగలడు అని పేరున్న సూర్య తాజాగా టి20ల్లోనూ విఫలం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

చదవండి: ఒక్కడే పోరాడితే సరిపోదు.. జట్టు మొత్తం ఆడితేనే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement