
ఐపీఎల్ 2022లో మార్చి 27న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై గత సీజన్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈసారి మాత్రం మెగావేలంలో ఇషాన్ కిషన్‌ను రిటైన్ చేసుకోవడంతో పాటు టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ లాంటి యంగ్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ముఖ్యంగా జూనియర్ ఏబీగా పిలుస్తోన్న డెవాల్డ్ బ్రెవిస్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.
తాజాగా బ్రెవిస్ ఆ అంచనాలు అందుకునేలా కనిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్‌లో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. అసలు బంతి ఎటువైపు వస్తుందో కూడా చూడని బ్రెవిస భారీ షాట్లు ఆడాడు. అతని షాట్లు కూడా కళ్లు తిప్పికోకుండా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్‌లో షేర్ చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ షాట్లు చూడముచ్చటగా ఉన్నాయి.. చూడకుండా ఉండలేకపోతున్నాం అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా వేలంలో బ్రెవిస్ రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
Can't stop looking at DB's 👀 𝑵𝒐 𝑳𝒐𝒐𝒌 👀 shots! 🔥#OneFamily #DilKholKe #MumbaiIndians #DewaldBrevis MI TV pic.twitter.com/QQzPUxDdB2
— Mumbai Indians (@mipaltan) March 26, 2022