
టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ నుంచి ఫ్యాంటసీ గేమ్ ఫ్లాట్ ఫామ్ డ్రీమ్ 11 తప్పుకొన్న సంగతి తెలిసిందే. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో డ్రీమ్ 11 ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆసియాకప్ టోర్నీలో ప్రధాన స్పాన్సర్‌షిప్ లేకుండానే భారత జట్టు ఆడనుంది.
అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ సమయానికి మాత్రం టీమిండియాకు కొత్త స్పాన్సర్‌ను బీసీసీఐ తీసుకురానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీమిండియా స్పాన్పర్ షిప్ కోసం భారత క్రికెట్ బోర్డు టెండర్లను అహ్హనించింది.
ఇందుకోసం ఆసక్తి ఉన్న కంపెనీలు సెప్టెంబర్ 16 లోపు తమ ధరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. బిడ్డింగ్‌లో పాల్గోనే కంపెనీలు ఐఈఓఐ కింద రూ. 5,90,000(నాన్ రిఫండ్‌బుల్) ధరఖాస్తు రుసుము చెల్లించాలి.
అంతేకాకుండా ధరఖాస్తు చేసే కంపెనీల వార్షిక టర్నోవర్ కనిష్టంగా రూ.300 కోట్లు అయినా ఉండాలని నిబంధనను బీసీసీఐ విధించింది. వీటితో పాటు స్పాన్సర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలకు పలు మార్గదర్శకాలను బోర్డు జారీ చేసింది.
స్పాన్సర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలకు మార్గదర్శకాలు ఇవే..
👉అథ్లెటిజర్, స్పోర్ట్స్‌వేర్ తయారీదారులు ధరఖాస్తు చేయకూడదు.
👉బ్యాంకులు, ఆర్ధిక సేవలను అందించే సంస్థలు, బ్యాంకింగేతర ఆర్ధిక కంపెనీలకు అవకాశం లేదు.
👉శీతల పానీయాలు తాయారు చేసే కంపెనీలకూ ఛాన్స్ లేదు.
👉కంపెనీలు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గాంబ్లింగ్‌తో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లఘించకూడదు
👉క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో ఎక్ఛేంజ్, క్రిప్టో టోకెన్స్‌కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో భాగస్వామ్యం ఉండకూడదు.
చదవండి: ఆసియాకప్‌లో లీడింగ్ వికెట్ టేకర్.. మూడేళ్లగా జట్టుకు దూరం