RSWS 2022: మరీ ఇంత బద్దకమా.. ఒక్క దానితో పోయేది!

రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంక లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంక లెజెండ్స్ 70 పరుగులతో విజయం సాధించింది. తిలకరత్నే దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.ఈ విషయం పక్కనబెడితే.. బంగ్లాదేశ్ ఫీల్డర్ బద్దకానికి ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బంతి దొరికితే త్రో వేయాల్సింది పోయి అలాగే నిల్చుండిపోవడం జట్టుకు నష్టం చేకూర్చింది.
ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు కేవలం ఒక్క పరుగు రావాల్సిన చోట నాలుగు పరుగులు తీయడం ఆసక్తి కలిగించింది. లంక లెజెండ్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ లెజెండ్స్ బౌలర్ వేసిన బంతిని లంక బ్యాటర్ స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి గాల్లోకి లేచింది. కీపర్ క్యాచ్ అందుకునే క్రమంలో మిస్ అవడంతో అతని కాలికి బంతి తగిలి ముందుకు వెళ్లింది.
ఈలోగా అక్కడికి థర్డ్‌మన్ ఫీల్డర్ వచ్చాడు. బంతిని అందుకున్నప్పటికి త్రో వేయలేదు. అప్పటికే లంక లెజెండ్స్ రెండు పరుగులు పూర్తి చేశారు. త్రో వేయకపోవడంతో మూడో పరుగుకు యత్నించారు. ఫీల్డర్ టెన్షన్‌లో సరిగ్గా త్రో వేయలేకపోయాడు. అలా బంతి మరోసారి మిస్ అయింది. దీంతో లంక బ్యాటర్లు మరో పరుగు పూర్తి చేశారు. అలా ఒక్క పరుగు పోయి నాలుగు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఇప్పటికే రోడ్‌సేప్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్‌లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. మొదటి సెమీఫైనల్(సెప్టెంబర్ 28న)లో శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్(సెప్టెంబర్ 29న) పోటీపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది.
Oh they ran four 😃 TM Dilshan & Mahela Udawatte during the legends game vs Bangladesh pic.twitter.com/GQbcOilJ1n
— Nibraz Ramzan (@nibraz88cricket) September 28, 2022