వార్నర్‌ ఔట్‌; మ్యాచ్‌కు వర్షం అంతరాయం

Australia vs India 3rd Test Day 1 Live Updates - Sakshi

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(5)ను తక్కువ స్కోరుకే మహ్మద్‌ సిరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు. పుజారాకు క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 21/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. వర్షం కారణంగా ఆటకు మరోసారి అంతరాయం కలిగింది. 

అంతకుముందు టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన్‌ ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ముందుగా బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. కాగా, మళ్లీ మ్యాచ్‌ ఆరంభమైన తర్వాత వర్షం పడటంతో మరొకసారి నిలిచిపోయింది. 7.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 21 పరుగుల వద్ద ఉండగా మళ్లీ వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. 

షైనీ ఆరంగ్రేటం
హిట్‌మన్‌ రోహిత్‌ శర్మ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు జట్టులో స్థానం దక్కలేదు. గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో నవదీప్‌ షైనీని జట్టులోకి తీసుకున్నారు. టెస్టుల్లో భారత్‌ తరపున 299వ ఆటగాడిగా షైనీ ఆరంగ్రేటం చేశాడు. సహచర ఆటగాళ్ల అభినందనల నడుమ సీనియర్‌ బౌలర్‌ బుమ్రా చేతుల మీదుగా టెస్ట్‌  జట్టు క్యాప్‌ను షైనీ అందుకుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున విల్‌ పకోవ్‌స్కీ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు.

భారత్‌ (తుది జట్టు): రహానే (కెప్టెన్‌), రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ.

ఆస్ట్రేలియా (అంచనా): పైన్‌ (కెప్టెన్‌), వార్నర్, పకోవ్‌స్కీ, స్మిత్, లబ్‌షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్‌.

చదవండి: ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానంలోకి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top