Simon Doull: హృదయాలు కొల్లగొట్టింది.. సూపర్‌.. స్టన్నింగ్‌! ఇంక ఆపుతావా?

After Slamming Babar Simon Doull Comment On Hassan Ali Wife Viral - Sakshi

PSL 2023- Simon Doull: న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సైమన్‌ డౌల్‌ మరోసారి తన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్‌ అవుతున్నాడు. ‘నీకిది అవసరమా’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘పర్లేదు.. అతడు అన్నదాంట్లో తప్పేముంది’ అంటూ మరికొందరు సమర్థిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో నేపథ్యంలో సైమన్‌ డౌల్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

రావల్పిండి వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌- ముల్తాన్‌ సుల్తాన్స్‌ తలపడ్డాయి. ఇందులో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇస్లామాబాద్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్‌ కింగ్స్‌ను 205 పరుగులకు అవుట్‌ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్‌ 19.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన పోరులో అద్భుత విజయం అందుకుంది. దీంతో ఇస్లామబాద్‌ యునైటెడ్‌ శిబిరంలో సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ క్రమంలో డగౌట్‌లో ఉన్న హసన్‌ అలీ భార్య సమియా అర్జూ సైతం ఆనందంతో గెంతులేసింది. నమ్మశక్యంరాని రీతిలో భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు గెలుపొందడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ నేపథ్యంలో కెమెరాలు సమియా సెలబ్రేషన్స్‌ మీద దృష్టిసారించాయి. 

హృదయాలు కొల్లగొట్టింది. సూపర్‌.. స్టన్నింగ్‌
సమియా రూపానికి ఫిదా అయిన సైమన్‌ డౌల్‌.. ‘‘ఆమె గెలిచింది. నాకు తెలిసి ఇక్కడున్న చాలా మంది హృదయాలు ఆమె కొల్లగొట్టింది. సూపర్‌.. స్టన్నింగ్‌’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. దీంతో నెటిజన్లు 53 ఏళ్ల డౌల్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు.  

‘‘ఇంక ఆపెయ్‌! ఆట గురించి మాట్లాడమంటే.. నువ్వు చేసే పని ఇదా! జట్టును గెలిపించడానికి కృషి చేసిన ఆ ఆటగాళ్ల గురించి వర్ణించేందుకు నీ భాషాప్రావీణ్యాన్ని ఉపయోగించు.. బాగుంటుంది’’ అని ట్రోల్‌ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. అందాన్ని ఆస్వాదించడంలో తప్పేముంది? అంటూ సైమన్‌ డౌల్‌కు అండగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో హసన్‌ అలీ బెంచ్‌కే పరిమితం అయ్యాడు.

ఇక ఆఖరి వరకు అజేయంగా నిలిచి 51 పరుగులతో రాణించిన ఫహీం అష్రఫ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఇటీవల పాక్‌ కెప్టెన్‌, పెషావర్‌ జల్మీ సారథి బాబర్‌ ఆజం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఇక హసన్‌ అలీ భార్య సమియా భారత్‌కు చెందిన ఫ్లైట్‌ ఇంజనీర్‌ అన్న విషయం తెలిసిందే.  

చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్‌ భరత్‌కు కోహ్లి ఆదేశం
Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్‌.. సర్వెంట్‌ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ..

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top