
వయసు మీద పడేకొద్ది కంటిచూపు మందగిస్తుంది. అలాంటిది 90 ఏళ్ల బామ్మ మాత్రం సరిగ్గా గురిచూసి షూట్ చేసింది. సరదాగా తన మనువడితో షూట్ అవుట్ ఆడి వహ్వా అనిపించుకుంది. మనువడు నెత్తిమీద పేపర్ బ్యాగ్ పెట్టుకోగా, బొమ్మ తుపాకీతో బామ్మ గురిచేసి కొట్టిడమే కాదు తన విజయానికి ఆనందంతో పరవశించిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేవలం ఆరు గంటల్లోనే 20 లక్షలమంది దీన్ని వీక్షించారు. ఈ వయసులోనూ బామ్మ గారు ఎంత ఉల్లాసంగా ఉన్నారో ..బామ్మ షూటింగ్‌కే కాదు,ఆమె చేసిన డ్యాన్స్‌కు కూడా మేం ఫిధా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
You may see this as just a simple clip, but I think it’s awesome!
— ⚽ Simon BRFC Hopkins ⚽ (@HopkinsBRFC) September 2, 2020
That’s his grandmother, I find it lovely to see the relationship they have and her being able to enjoy time with him even at her age, it’s beautiful, especially at a time like this ❤️ pic.twitter.com/zfBcRbGe0M