అప్రమత్తంగా వ్యవహరించాలి
● కలెక్టర్ హైమావతి ● క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన
గజ్వేల్: పంచాయతీ ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏ చిన్న సమస్య ఎదురైనా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు తెలపాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం గజ్వేల్ మండలం రిమ్మనగూడ క్లస్టర్‌లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. క్లస్టర్ చుటూ 144సెక్షన్ అమల్లో ఉందని, 100మీటర్లలోపు నామినేషన్ వేసే అభ్యర్థితోపాటు మరో ఇద్దరినీ మాత్రమే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వచ్చిన సమయాన్ని సైతం రికార్డు చేయాలని చెప్పారు. ప్రశాంతగా ఎన్నికల జరిగేలా అంతా సహకరించాలని కోరారు.
నామినేషన్ కేంద్రం సందర్శన
ములుగు(గజ్వేల్): సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సిబ్బంది సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం ఆమె ములుగు మండలం వంటిమామిడి రాజీవ్‌రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుతో పాటు చిన్నతిమ్మాపూర్‌లోని నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రాజీవ్‌రహదారిపై వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీచేయాలని కలెక్టర్ పోలీస్ సిబ్బందికి సూచించారు. అదేవిదంగా నామినేషన్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులను వివరాలను అడిగితెలుసుకున్నారు. అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.


