పశువుల కంటైనర్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పశువుల కంటైనర్‌ పట్టివేత

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

పశువుల కంటైనర్‌ పట్టివేత

ములుగు(గజ్వేల్‌): హైదరాబాద్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ఒక కంటైనర్‌ వాహనాన్ని ములుగు రాజీవ్‌రహదారిపై శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ రఘుపతి కథనం ప్రకారం.. ములుగు క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్‌రహదారిపై ఎస్‌ఐ సిబ్బందితో కలసి ట్రాఫిక్‌ నియంత్రిస్తున్న క్రమంలో హైదరాబాద్‌ వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ కంటైనర్‌ను ఆపి తనిఖీ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సర్వర్‌, ఇప్తేకార్‌, వాజీద్‌ అనే వ్యక్తులు సంగారెడ్డికి చెందిన రఫీక్‌కు సంబంధించిన వాహనంలో ఎలాంటి అనుమతి లేకుండా 80 పశువులను తరలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement