వేతనాల బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

వేతనాల బకాయిలు చెల్లించాలి

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

వేతనాల బకాయిలు చెల్లించాలి

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: పంచాయతీ కార్మికుల వేతన బకాయిలు చెల్లించడంతో పాటు మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులు ఉదయం నుంచి కష్టపడి పనిచేస్తున్న నేటికీ వారికి కనీస వేతనం అమలు కావడం లేదన్నారు. కార్మికులకు మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న మూడు నెలల బకాయి విత్తనాలను చెల్లించడంతో పాటు ఈఎస్‌, పీఎఫ్‌తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యాదగిరి, ప్రవీణ్‌, శంకర్‌, పంచాయతీ కార్మికులు సత్తయ్య, దశరథ్‌, పోచయ్య, మహేశ్‌, యాదమ్మ, విజయేందర్‌, రాములు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement