చికిత్స పొందుతూ పంచాయతీ కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ పంచాయతీ కార్మికుడు మృతి

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

వెల్దుర్తి(తూప్రాన్‌): వీధి దీపాలు మరమ్మతులు చేస్తుండగా స్తంభంపై నుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన పంచాయతీ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదకర ఘటన మండలంలోని హస్తాల్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన గడ్డె నాగరాజు(45) గ్రామ పంచాయతీ కార్యాలయంలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 2న గ్రామంలో వీధి లైట్లు మరమ్మతులు చేయడానికి విద్యుత్‌ స్తంభం ఎక్కగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగలడంతో సీసీ రోడ్డుపై పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతికి గ్రామ పంచాయతీ అధికారులు, పాలకవర్గం బాధ్యత వహించి నష్టపరిహారం ఇవ్వాలంటూ మృతుడి బంధువులు నిరసన వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement