
పగలు రెక్కీ.. రాత్రి చోరీ
కొండపాక(గజ్వేల్): ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కుకునూరుపల్లి పోలీస్టేషన్‌లో తొగుట సీఐ లతీఫ్ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి హైదరాబాద్‌లోని వినాయకనగర్‌లో నివాసం ఉంటున్నారు. సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో పగటి పూట రెక్కీ చేస్తూ.. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు. రాత్రి వేళల్లో దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో జల్సా చేసేవారు. ఈ క్రమంలో జిల్లాలోని 19 చోట్ల దొంగతనాలు చేయగా 6 పోలీస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం కుకునూరుపల్లిలోని బస్టాండ్ వద్ద ఎస్సై శ్రీనివాస్ పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అన్నారెడ్డి రమేష్, కూజ నర్సయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరిని కోర్టులో హాజరుపర్చారు. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు.
ముఠాలో ఇద్దరు అరెస్ట్
మిగతా నులుగురి కోసం గాలింపు
వివరాలు వెల్లడించిన సీఐ లతీఫ్