
బతికి వస్తేనే మాకు బతుకు
నా భర్త రాజేష్ కుమార్ చౌదరీ సిగాచిలో లేబర్‌గా పని చేస్తున్నాడు. పొట్టచేత పట్టుకొని నగరానికి వలస వచ్చాం. అనుకోని ప్రమాదంలో నా భర్త తీవ్రంగా గాయపడటంతో ఎమి చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఐదుగురు ఆడపిల్లలు ఉండగా ఇప్పటికే ఇద్దరి పెళ్లిళ్లు చేశాం.ఆయన జీతంతోనే కుటుంబం గడుస్తోంది. ఐసీయూలో ఉన్న ఆయన బతికి తిరిగి వస్తేనే మాకు బతుకు ఉంటుంది.
– సనాపతి, బీహర్
దేవుడా కనికరించు
దేవుడా ఒక్కసారి కనికరించు... నా భర్తను క్షేమంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపు. గత జూలై 16న ధర్మరాజ్‌తో వివాహం జరిగింది. ఎనిమిది నెలల క్రితం నేను ఆయనతో కలిసి వచ్చి గృహిణీగా ఉంటున్నాను. సంవత్సరం తిరగక ముందే దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు. సిగాచి పేలుడులో నా భర్త గాయాలపాలయ్యాడు. ఐజీయూలో ఉన్న ఆయన ప్రాణాలతో తిరిగి రావాలని భగవంతుడిని కోరుకుంటున్న.
– కశ్మీరా కుమారీ, బీహర్
కళ్ల ముందే కకావికలం
సోమవారం ఉదయం 9.30 తరువాత సిగాచిలో పేలుడు సంభవించింది. స్టోర్ అసిస్టెంట్ ఆఫీసర్‌గా ఉన్న నేను కంపెనీ భవనం బయట ఉన్నాను. ఒక్క సారిగా భారీ పేలుడు శబ్ధం రావడంతో ఉలిక్కి పడ్డాను అంతలోనే పెద్ధ ఎత్తున మంటలు, దట్ట మైన పొగ భవన శిథిలాలు ఎగిరి వచ్చి తగలడంతో శరీరానికి గాయాలయ్యాయి.ప్రమాదాన్ని ఊహించుకుంటే భయమేస్తుంది. మూడు రోజులుగా చికిత్స అందించగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను. –యశ్వంత్, విజయవాడ

బతికి వస్తేనే మాకు బతుకు

బతికి వస్తేనే మాకు బతుకు

బతికి వస్తేనే మాకు బతుకు