
స్నేహితుడి ఆచూకీ కోసం..
పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం ఒడిశా నుంచి పటాన్‌చెరుకు వచ్చారు 28 సంవత్సరాల దీపక్. తన స్నేహితులతో కలిసి ఇస్నాపూర్‌లోని ఓ గదిని అద్దెకుంటున్నాడు. మూగ్గురు మూడు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. మూడు నెలల క్రితమే దీపక్ ఈ సిగాచీ పరిశ్రమలో చేరారు. సోమవారం ఉదయమే పనికి వెళ్లిన దీపక్ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఒక్కడే ఇక్కడ ఉండటంతో ఆయనకు సంబంధించిన కుటుంబసభ్యులు ఎవరూ ఇక్కడ లేరు. దీపక్‌తో పాటు అద్దె గదిలో ఉంటున్న తన స్నేహితులు సునాముద్దీన్, బవుజీలు ఇతర స్నేహితులు ఇప్పుడు దీపక్ ఆచూకీ కోసం పరిశ్రమ వద్దకు వచ్చి అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అడిగితే అధికారుల నుంచి స్పందన లేదని సునాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్నేహితుడి ఆచూకీ కోసం..