
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
పోలీస్ ట్రైనింగ్ అకాడమి ప్రిన్సిపాల్ మధుకర్‌స్వామి
దుబ్బాక: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమి కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్‌స్వామి అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలో అఖిలరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులకు వాట్ నెక్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఎక్కువగా సెల్‌ఫోన్లు చూస్తున్నారని, అవసరముంటే తప్పా వాడకూడదన్నారు. గుట్కాలు , డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోద్దని సూచించారు. విద్యార్థుల నడవడికను వారి తల్లిదండ్రులు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలరాజ్ ఫౌండేషన్ అధినేత, కూకట్‌పల్లి ఎస్‌ఐ తౌడ సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్తలు చింత రాజు, నల్ల శ్రీనివాస్, సభ్యులు రవి, సాగర్, మహేష్, ప్రవీణ్, విద్యార్థులు పాల్గొన్నారు.