అక్రమ నిర్మాణాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల కూల్చివేత

May 31 2025 6:54 AM | Updated on May 31 2025 6:54 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత

పటాన్‌ చెరు: అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శెట్టికుంట ఊబకుంట చెరువు సర్వే నంబర్‌ 947 ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన భవనాలతోపాటు నిర్మాణంలో ఉన్న భవనాలను శుక్రవారం రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చివేశారు. మాజీ సర్పంచ్‌ ఎఫ్‌టీఎల్‌లో 200 గజాలకుపైగా నిర్మించిన భవనంతోపాటు మరికొంతమంది భవనాలను నేలమట్టం చేశారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న వాటిని గుర్తించి త్వరలో మరిన్ని కూల్చివేతలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.

గృహ ప్రవేశాల డ్రామా..?

ఒకరు తమ ఇంటి ముందు గుమ్మడికాయ ఇతర అలంకరణ చేసి గృహ ప్రవేశానికి ఓ ఇంటిని సిద్ధం చేయగా రెవెన్యూ అధికారులు దాన్ని కూల్చివేశారు. అయితే స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ రెడ్డి మాట్లాడుతూ...దాన్ని ఓ నాటకంగా కొట్టి పారేశారు. కూల్చివేతకు ముందు రాత్రి తాను అక్కడ పర్యటించానని ఎలాంటి గృహ ప్రవేశ ఆనవాళ్లు కనిపించలేదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement