 
															అమరుల త్యాగాలు మరువలేనివి
ఇబ్రహీంపట్నం: పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేమని.. వారిచ్చిన స్ఫూర్తితో ప్రజలకు రక్షణగా, అండగా పోలీసులు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు నాగరాజు, రామకృష్ణ, ఆదిబట్ల, ఫార్మాసిటీ, యాచారం, మంచాల, మాడ్గుల పోలీస్‌స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
మహేశ్వరంలో మెగా రక్తదాన శిబిరం
మహేశ్వరం: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి అని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శివగంగ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన యువకులు, కార్మికులు, పోలీసులకు ఆమె పండ్లు పంపిణీ చేసి అభినందించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, మహేశ్వరం, కందుకూరు, పహాడిషరీఫ్, బాలాపూర్ సీఐలు వెంకటేశ్వర్లు, సీతారాం, రాఘవేందర్‌రెడ్డి, సుధాకర్, ఎస్‌ఐలు ప్రసాద్, రాఘవేందర్ రావు, ధనుంజయ్, మహేశ్వరం ప్రభుత్వ వైద్యాధికారి డా.అమీర్ సిద్దీఖీ పాల్గొన్నారు.
మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
