 
															విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు
● బోధన రుసం బకాయి చెల్లించండి
● విద్యార్థి సంఘం నాయకుల డిమాండ్
● ఎస్‌ఎఫ్‌ఐ కళాశాల బంద్ విజయవంతం
ఇబ్రహీంపట్నం: ఉపకార వేతనం, బోధన రుసం బకాయి చెల్లించకుండా పాలకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షుడు బోడ వంశీ, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు మేరకు ఇంటర్, డిగ్రీ, పారా మెడికల్, ఇంజినీరింగ్, లా కళాశాలలను ఆ సంఘం ఆధ్వర్యంలో పట్నంలో గురువారం బంద్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్ మెంట్ బిల్లులుపెండింగ్ పెడితే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్..రెండేళ్లుగా వాటి ఊసేత్తడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పే.. రేవంత్ సర్కార్ చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికై నా స్పందించి, పేరుకుపోయిన సుమారు రూ.8,500 కోట్లనువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా స్థానిక గురునానక్ ఇంజినీరింగ్‌కళాశాల వద్ద, విద్యార్థి సంఘం నేతలను లోపటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో వారు గేట్ దూకి వెళ్లి, కళాశాలను బంద్ చేయించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎఫ్ నేతలు రామ్ చరణ్, అజయ్, జశ్వంత్, సాయిరాం, సిద్దు, ప్రశాంత్, వినయ్, మనీలు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
