 
															బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలి
షాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిపంపిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును..కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలనికాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారంతో 19వ రోజుకుచేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి, రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. రిజర్వేషన్ల అమలుపై కేంద్రం రాజకీయ ఆటలు ఆడుతోందని, సామాజిక న్యాయం కోసం, పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అవసరమైన బిల్లును అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బిల్లును పార్లమెంట్‌లో చట్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్‌కుమార్, వీరశైవ లింగాయత్ సంఘం మండల నాయకులు మల్లికార్జున్, నవీన్, యాదగిరి, రాజేష్, పరిషవేది, బాబు, బీసీ రిజర్వేషన్ సాధన సమితి సభ్యులు రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి
భీంభరత్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
