
అండగా నిలిచి.. వైద్యం చేసి
ఔటర్, సర్వీస్ రోడ్ల పై ప్రమాదాల బారిన పడుతున్న వారికి ట్రామా కేర్ సెంటర్లు అండగా నిలుస్తున్నాయి. సకాలంలోవైద్య సేవలు అందించి ప్రాణాలు నిలుపుతున్నాయి. రింగురోడ్డు చుట్టూ ఏర్పాటు చేసిన 16 కేంద్రాల ద్వారా నాలుగేళ్లుగావందలాంది మంది క్షతగాత్రులకువైద్య చికిత్స అందిస్తున్నారు.
తుక్కుగూడ: ట్రామా కేర్ సెంటర్లతో క్షతగాత్రుల కు సకాలంలో ప్రథమ చికిత్స అందుతోంది. ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్)లో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు చోట్టు చేసుకుంటున్న నేపథ్యంలో బాధితులకు సత్వర వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నిర్వాహకులు కేర్ కేంద్రాలనునెలకొల్పారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి ఆధ్వర్యంలో నిరంతరం సేవలను కొనసాగిస్తున్నారు.
ట్రోల్స్ కార్యాలయాల్లో కేంద్రాలు
ఔటర్ చుట్టూ 19 ట్రోల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాల్లోనే 16 ట్రామా కేర్ సెంటర్లను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు శంషాబాద్, పెద్దగోల్‌కొండ, తుక్కుగూడ, రావిర్యాల, బొంగ్లూర్, పెద్దఅంబర్‌పేట, తారమతిపేట, ఘటుకేసర్, శామీర్‌పేట, మేడ్చల్, అప్పాజంక్షన్, పటాన్‌చెరువు, దుండిగల్‌లో నాలుగేళ్ల క్రితం కేంద్రాలను ప్రారంభించారు.
అందుబాటులో వైద్య సేవలు
ట్రామా కేర్ సెంటర్ల ద్వారా ఔటర్ రింగు రోడ్డు, సర్వీస్ రోడ్డులో ప్రమాదాలకు గురైన వారికి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ప్రథమ చికిత్స చేయడానికి వైద్య సిబ్బంది, బెడ్లు, ఆక్సిజన్, పరికరాలు బీపీ కొలమానం తదితర సామగ్రి అందుబాటులో ఉంటాయి. క్షతగాత్రులను తీసుకురావడానికి అంబులెన్స్ సౌకర్యం ఉంటుంది. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించడానికి డ్యూటీలో ఉన్న సిబ్బంది నగరంలోని పెద్ద ఆస్పత్రులకు తరలిస్తారు. గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంలో సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
రోడ్డు ప్రమాద బాధితులకు
వరంగా ట్రామా కేర్ సెంటర్లు
క్షత్రగాత్రుల ప్రాణాలు నిలుపుతున్న వైనం
నాలుగేళ్లుగా వందలాది మందికి సేవలు
ప్రజాసేవలో ఓఆర్‌ఆర్ చుట్టూ
16 కేంద్రాలు
ప్రథమ చికిత్స అందిస్తారు
ఓటర్‌లో ప్రమాదాల బారి న పడిన వారి కోసం అపో లో, యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో ట్రామా కేర్ సెంటర్లును ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎక్కడో ఓ చోట నిత్యం వాహనదారులు ప్రమాదంలో పడుతుంటారు. వారికి ఇక్కడ ప్రథమ చికిత్స చేసి, ఆరోగ్య పరిస్థితిని బట్టి అపోలోకు తరలిస్తాం.
– నరేష్, ట్రామా ఉద్యోగి
సేవలు భేష్
ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు ఓఆర్‌ఆర్ ట్రోల్ సెంటర్ల వద్ద ఉన్న ట్రామా కేర్ సెంటర్ల ద్వారా వైద్య చికిత్స అందిస్తున్నారు. తక్షణమే అందుతున్న వైద్య సేవల ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. సెంటర్ సేవలు చాలా బాగున్నాయి.
– శేఖర్‌గౌడ్, ఓఆర్‌ఆర్ ఉద్యోగి

అండగా నిలిచి.. వైద్యం చేసి

అండగా నిలిచి.. వైద్యం చేసి