
అందుబాటులో ఉంటాం
జీపీవోలుగా నియామకమైన వారిలో అధిక శాతం గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వారే. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో తిరిగి జీపీవోలుగా నియమితులయ్యాం. ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రజలకు సత్వర రెవెన్యూ, భూ సేవలను అందిస్తాం. క్షేత్రస్థాయిలో నిబంధనల మేరకు పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాం.
– రాజేందర్, జీపీవో, ముస్తాబాద్
ప్రజలకు సత్వర రెవెన్యూ సేవలను జీపీవోలు అందిస్తారు. ధ్రువీకరణపత్రాల విచారణ, రెవెన్యూ భూరికార్డులు, ప్రజల ఆస్తుల పరిరక్షణ వంటి వాటిపై కీలకంగా పనిచేస్తారు. జీపీవోలతో మండల, జిల్లా స్థాయి అధికారులకు తక్షణ సమాచారం అందుబాటులో ఉంటుంది. పని భారం తగ్గుతుంది.
– సురేశ్, తహసీల్దార్, ముస్తాబాద్

అందుబాటులో ఉంటాం