సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా సోమవారం మళ్లీ ముసురు వర్షం కురిసింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు ఆదివారం గెరువచ్చి సోమవారం మళ్లీ కురిశాయి. వీర్నపల్లి మండలంలో అత్యధికంగా 27.1 మిల్లీ మీటర్లు, రుద్రంగిలో 14.6, చందుర్తిలో 8.9, వేములవాడ రూరల్‌లో 10.9, బోయినపల్లిలో 14.8, వేములవాడలో 7.8, సిరిసిల్లలో 6.0, కోనరావుపేటలో 10.4, ఎల్లారెడ్డిపేటలో 7.4, గంభీరావుపేటలో 4.2, ముస్తాబాద్‌లో 2.5, తంగళ్లపల్లిలో 9.9, ఇల్లంతకుంటలో 9.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
మూడు రోజులు వైన్స్ బంద్
సిరిసిల్ల: మూడు రోజులపాటు వైన్స్(మద్యం) షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు విక్రయాలు నిలిపివేయాలని కలెక్టర్ సందీప్‌కుమా ర్ ఝా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో గురువారం నుంచి ఆదివారం ఉదయం వరకు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సిరిసిల్లటౌన్: అర్బన్‌బ్యాంకులో పాలకవర్గం, అధికారుల చర్యలపై విచారణ చేపట్టాలని బ్యాంకు ప్రాథమిక సభ్యులు సోమవారం జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన బ్యాంకు వార్షిక మహాసభలో ప్రాథమిక సభ్యులపై బ్యాంకు చైర్మన్ అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. మహాసభ అనుమతి లేకుండా పాలకవర్గం సిట్టింగు ఫీజులు అధికంగా తీసుకుంటున్నారని, ఆరేళ్లుగా సీఈవో పోస్టును రిటైర్డ్ ఉద్యోగితో రూ.70వేల వేతనం ఇస్తూ నడిపించడం బ్యాంకు అభివృద్ధికి కంటకమన్నారు. చిప్ప దేవదాసు, కుసుమ గణేష్, వేముల పోశెట్టి, బోడ శ్రీనివాస్ ఉన్నారు.
సిరిసిల్లటౌన్: యూరియా కష్టాలకు బీజేపీ ఎంపీల చేతగానితనమేనని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి విమర్శించారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో సోమవారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీసీల బిల్లు విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ గోడమీద పిల్లిల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. కడారి రాములు, సోమ నాగరాజు, కేవీ అనసూర్య, ఎనగంటి రాజు, గాజుల లింగం పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: టెక్స్‌టైల్ పార్కు కార్మికుల కూలి పెంచేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ కోరారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం కార్మికులతో కలిసి ధర్నా చేసిన సందర్భంగా మాట్లాడారు. టెక్స్‌టైల్ పార్క్ కార్మికుల కూలి పెంచాలని 14 రోజులుగా సమ్మె చేస్తున్నా యజమానులు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వగా.. స్పందించిన ఆయన చేనేత జౌళిశాఖ ఏడీకి విషయం చెప్పి కూలీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాయకులు కూచన శంకర్, కోడం రమణ, జెల్ల సదానందం, సంపత్, శ్రీకాంత్, రవి పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: పట్టణంలో సంచార పశువులను యజమానులు వెంటనే రోడ్లపై నుంచి తీసుకెళ్లాలని మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా సూచించారు. రోడ్లపై పశువులు సంచరిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజా వాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకటన వి డుదల చేశారు. ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా పశువులను తరలించకుంటే రాజన్న ఆలయ గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు.