
● 9వ ప్యాకేజీ రైతుల ఆందోళన
వీర్నపల్లి(సిరిసిల్ల): 9వ ప్యాకేజీ పైపులైన్ పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు ఉన్న మొత్తం భూమి పట్టాల వివరాలు గల్లంతయ్యాయని, తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం వీర్నపల్లి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ.. పైపులైన్ పనుల్లో పోయిన భూమి మాత్రమే పట్టాల నుంచి డిలీట్ అవుతుందని అధికారులు చెబితే.. మొత్తం భూమి పోయిందన్నారు. వీర్నపల్లి, మద్దిమల్ల, బంజేరు, కంచర్ల గ్రామాల్లోని రైతులు కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి పైపులైన్‌లో పోగా మిగిలిన భూమి వివరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు ప్రకాశ్, దర్శనాల లింబాద్రి, అన్నారం జనార్దన్, లక్ష్మణ్, శేఖర్, మల్లారపు అరుణ్‌కుమార్, పిట్ల నాగరాజు, రాజేశం, ప్రవీణ్, దేవయ్య, నర్సయ్య, శంకర్, అంజయ్య పాల్గొన్నారు.