
భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోం
● ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి
వేములవాడ: రాజన్న దర్శనానికి వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోబోమని ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి హెచ్చరించారు. ఆలయ పరిసరాల్లోని బెల్లం, కొబ్బరికాయలు కొట్టే ప్రాంతాలను శనివారం పరిశీలించారు. బెల్లం ముద్దలను పరిశీలించి, తూకం వేసి చూశారు. కొబ్బరికాయ కొట్టే స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఏఈవోలు శ్రవణ్, శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కూరగాయల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
వంతెన కోసం మహాధర్నా
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట, లింగన్నపేటల మధ్య మానేరువాగుపై హైలెవల్ వంతెన పనుల్లో వేగం పెంచాలని కోరుతూ పలు పార్టీల నాయకులు శనివారం మహాధర్నా, నిరసన దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ పనులను చూస్తుంటే రానున్న వర్షాకాలం వరకు కూడా పనులు పూర్తయ్యేలా లేవన్నారు. శివసేన రాష్ట్ర నాయకులు గౌటె గణేశ్, బీజేపీ జిల్లా నాయకులు కొక్కు దేవేందర్‌యాదవ్, పెద్దూరి పర్శాగౌడ్, కృష్ణకాంత్‌యాదవ్, శ్రావణ్‌యాదవ్, దేవాగౌడ్, ప్రజా బంధు పార్టీ జిల్లా నాయకుడు దోసల చంద్రం, పార్థసారధిశర్మ తదితరులు పాల్గొన్నారు.

భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోం