నవోదయలో ఇంటర్‌ ప్రవేశాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

నవోదయలో ఇంటర్‌ ప్రవేశాలకు ఆహ్వానం

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

నవోదయలో ఇంటర్‌ ప్రవేశాలకు ఆహ్వానం నాటు సారా రవాణా చేస్తున్న వ్యక్తి పట్టివేత

ఒంగోలు టౌన్‌: జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మిగులు సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సి.శివరాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదివి పాసై ఉండాలని చెప్పారు. మొత్తం 60 శాతం మార్కులతో పాటు సైన్స్‌ సబ్జెక్టులో 60 శాతం, గణితంలో 60 శాతం మార్కులు కచ్చితంగా వచ్చి ఉండాలని వివరించారు. 2025–26 కంటే ముందు పాసైన విద్యార్థులు అనర్హులని తెలిపారు. అభ్యర్థులు 01–06–2009 నుంచి 31–07–2011 మధ్యలో జన్మించి ఉండాలన్నారు. ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు వివరాలు పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల లిస్టుపై హెడ్‌మాస్టర్‌ సంతకంతో అటెస్ట్‌ చేయించాలన్నారు. ఆదాయ, నివాస స్టఫికెట్లు సమర్పించాలని, నేరుగా విద్యాలయానికి వచ్చి దరఖాస్తు అందజేయవచ్చని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

5 లీటర్ల నాటుసారా, బైక్‌ స్వాధీనం

కనిగిరి రూరల్‌: మండలంలోని యడవల్లి శివారు ప్రాంతంలో ఈత చెట్ల తోపు పరిసరాల్లో నాటుసారా రవాణా చేస్తున్న అన్నం నరసింహులు అనే వ్యక్తిని ఆదివారం ఎకై ్సజ్‌ పోలీసులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ (ఒంగోలు) కే విజయ్‌ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా రవాణా చేస్తున్న అన్నం నరసింహులును పట్టుకుని అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారా, బజాజ్‌ పల్సర్‌ బైక్‌ సీజ్‌ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు కనిగిరి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ ఆర్‌.విజయ భాస్కర్‌రావు తెలిపారు. ఈ దాడుల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఆర్‌.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement