
మత్తులో మందుబాబు
మార్కాపురం: మద్యం మత్తు ఎక్కువై రోడ్డుపై డివైడర్ల మధ్య ఓ వ్యక్తి పడిపోయిన ఘటన మార్కాపురంలో మంగళవారం జరిగింది. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన ప్రముఖ రచయిత్రి మొల్ల విగ్రహం వద్ద మద్యం ఎక్కువై ఓ వ్యక్తి అడ్డంగా పడిపోయాడు. సుమారు గంటన్నర సేపు మద్యం మత్తులో ఉండి అలాగే పడుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మార్కాపురం పట్టణంలో మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. రచయిత్రి మొల్ల విగ్రహం వద్ద మందుబాబులు ఇలా తరచుగా పడుకోవడం విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేయడం, బెల్టుషాపులతో తమ సంసారాలు నాశనమైపోతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.